రెడ్ బుక్ లేదు తొక్కలేదు… సజ్జలకు ‘గ..’ వణికే షాక్ ఇచ్చిన పవన్
అప్పట్లో ముఖ్యమంత్రి ఎవరు అంటే అధికారికంగా వైఎస్ జగన్.. అనధికారికంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్షాలపై ఆరోపణలు, మంత్రుల నిర్ణయాలు ఎవరు ఏం మాట్లాడాలి అనేదానిపై ప్రసంగాలు అన్నీ కూడా సింగిల్ హ్యాండ్ గా మెయింటైన్ చేసేవారు.
అప్పట్లో ముఖ్యమంత్రి ఎవరు అంటే అధికారికంగా వైఎస్ జగన్.. అనధికారికంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్షాలపై ఆరోపణలు, మంత్రుల నిర్ణయాలు ఎవరు ఏం మాట్లాడాలి అనేదానిపై ప్రసంగాలు అన్నీ కూడా సింగిల్ హ్యాండ్ గా మెయింటైన్ చేసే సజ్జల జగన్ కు తలలో నాలుక న కాదు… కాదు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి మించి అన్నట్టు బిహేవ్ చేశారు. సాధారణంగా ప్రభుత్వాల్లో బయట వ్యక్తుల జోక్యం అనేది సహజంగా ఉంటుంది.
కానీ సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం మాత్రం అతి అనేది క్లియర్గా అర్థమైంది. ప్రతిపక్షాలపై పోలీసులను రెచ్చగొట్టి ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేయించి.. జగన్ మెప్పు పొందడం కోసం సజ్జల అప్పట్లో చేయని వ్యవహారం లేదు. అలాంటి సజ్జలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంతా నాదే అనే చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముహూర్తం ఫిక్స్ చేశారు.
వైసిపి గవర్నమెంట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఎల్లో మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్కులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ముందు ఉంటుంది. అలాంటి సజ్జలను ప్రభుత్వం మారిన ఆరు నెలల తర్వాత కూడా ఏమి చేయకపోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒళ్ళు మండేలా చేసింది. ఈ వ్యవహారంలో అన్ని గమనిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగారు. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలను అలాగే వస్తున్న ఆరోపణలను పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి సొంత జిల్లా కడపలో చుక్కల భూములు అలాగే ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. 52 ఎకరాల భూములు ఆక్రమించి అక్కడ గెస్ట్ హౌస్ లు పళ్ళ తోటలు కూరగాయలు తోటలు వంటివి పెంచుతున్నారని ఎప్పటినుంచో మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. చిన్న చిన్న అధికారులైతే సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించే అవకాశం ఉంటుందని భావించిన పవన్ కళ్యాణ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడానికి రెడీ అయిపోయారు.
రెవెన్యూ అధికారులతో కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములను అదేవిధంగా కాళీ స్థలాలను ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల అక్రమ లేఅవుట్లు వేసి… రియల్ ఎస్టేట్ దందా కూడా తన మనుషులతో సజ్జల చేయించారని టిడిపి ఆరోపించింది.
ఇప్పుడు ఆ అక్రమాలన్నీ బయటకు లాగడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయారు. అధికారులు ఎవరూ భయపడవద్దని మీకు నేను అండగా ఉంటానని, సజ్జల చేసిన వ్యవహారాలన్నీ బయటకు రావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ కుటుంబాలకు భద్రత కల్పించే బాధ్యత నాది అంటూ వాళ్లకు హామీ ఇవ్వడంతో అధికారులు కూడా దూకుడుగా వెళుతున్నారు. సాధారణంగా కడప జిల్లాలో అధికారులు వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వారిలో ఒక ధైర్యాన్ని నింపి ఇప్పుడు సజ్జలో రామకృష్ణారెడ్డి వ్యవహారాలను బయటకు లాగేందుకు సిద్ధమయ్యారు.
కడప జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సజ్జల అక్రమ వ్యవహారాలు నడిపారని ముఖ్యంగా శ్రీశైలం ప్రాంతంలో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీటన్నిటిపై నివేదిక అందిన తర్వాత సజ్జలపై చర్యలకు రంగం సిద్ధం చేసే అవకాశం ఉండవచ్చు. స్వయంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో అధికారుల్లో కూడా ఒక రకమైన టెన్షన్ మొదలైంది. అటు చంద్రబాబు కూడా సజ్జల విషయం సీరియస్ గానే ఉండటంతో పవన్ కళ్యాణ్ త్వరలోనే కొన్ని సెన్సేషనల్ డెసిషన్స్ కూడా అనౌన్స్ చేయనున్నారు.