బ్రేకింగ్: ముగిసిన పవన్ దీక్ష, తిరుమలకు ఎప్పుడు…?
తిరుమల లడ్డు విషయంలో పాపం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నేటితో ఆ దీక్ష ముగిసింది.

తిరుమల లడ్డు విషయంలో పాపం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నేటితో ఆ దీక్ష ముగిసింది. ఇప్పటికే పలు ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన పవన్… నేడు తిరుమల చేరుకున్నారు. 11 రోజుల తర్వాత తిరుపతి లో పవన్ దీక్ష విరమిస్తారు. 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి తిరుపతి బయల్దేరి వెళ్తారు పవన్ కళ్యాణ్.
రేపు 10 గంటలకు తిరుమలలో దర్శనం చేసుకున్నారు. ఎల్లుండి పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. మూడు రోజులు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్తారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో అటు జనసేన నేతలు ఇటు పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.