ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. పవన్ కల్యాణ్ ఓ సినిమాలోని డైలాగ్ ఇది. సేనానికి పక్కాగా సరిపోయే మాటలు ఇవి. ఎవరు ఏమైనా అనుకోని.. ఎవరు ఏమైనా అననీ.. తగ్గడంలో తప్పు లేదు బ్రదర్.. ఏం చేసినా జనం కోసం.. జనం బాగు కోసమే అన్నట్లుగా పవన్ చెప్పిన మాటలు..
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. పవన్ కల్యాణ్ ఓ సినిమాలోని డైలాగ్ ఇది. సేనానికి పక్కాగా సరిపోయే మాటలు ఇవి. ఎవరు ఏమైనా అనుకోని.. ఎవరు ఏమైనా అననీ.. తగ్గడంలో తప్పు లేదు బ్రదర్.. ఏం చేసినా జనం కోసం.. జనం బాగు కోసమే అన్నట్లుగా పవన్ చెప్పిన మాటలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఎప్పుడూ చూడని విలయంలో విజయవాడ చిక్కుకుంది. ఆర్తనాదాలు, చావు కేకలు.. ఆకలి బాధలు.. గుక్కెడు నీటి కోసం చూపులు.. బుడమేరు బురదలో చిక్కుకొని.. జనం పడిన పాట్లు ఇవి.
అలర్ట్ చేయడంలో అధికారులు విఫలం అయ్యారా.. అధికారులను పరుగులు పెట్టించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందా అన్న సంగతి ఎలా ఉన్నా.. జనాల బాధలు మాత్రం వర్ణనాతీతం. విజయవాడ వరదల్లో చిక్కుకోవడంతో.. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వరదల్లో నడిచారు.. అధికారులను నడిపించారు. ఇంటింటికి వెళ్లి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు క్లాస్ పీకారు కూడా ! ఐతే వరదలు ముంచెత్తిన మొదటి మూడు రోజులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాడలో కనిపించలేదు.
దీంతో వైసీపీ నేతలు, పవన్ హేటర్స్… సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కల్యాణ్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదని ఘాటు విమర్శలు గుప్పించారు. ఐతే పవన్ ఇచ్చిన ఒక్క ఆన్సర్.. వాటన్నింటికి సమాధానం చెప్పింది. తాను వరద ప్రాంతాల్లోకి వెళ్తే.. ఏం జరుగుతుందో బాగా తెలుసు. అదే విషయం చెప్పారు. పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ ఫీల్డ్‌లో కనిపించారు అంటే.. వరదకు అభిమానుల రూపంలో మరో వరద యాడ్ అవుతుంది. అందులో ఆయన దూరంగా ఉన్నారు.
తను ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించానని.. మనిషిని ఎక్కడో ఉన్నా.. మనసు మాత్రం జనాలతోనే ఉందన్న పవన్ మాటలు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో శభాష్ అనిపిస్తున్నాయ్. ఫీల్డ్‌లోకి వెళ్లి పబ్లిసిటీ స్టంట్‌లు చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పవన్ ఇచ్చిన ఆన్సర్ వినిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనేది. ఎవరు ఏమన్నా.. తక్కువ చేసినా.. ఆ స్థాయికి దిగజారి మాటలు అనాల్సిన అవసరం లేదని.. తనకంటూ ఓ క్లారిటీ ఉందని.. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.