ఊహకు అందని స్థాయిలో పవన్ కళ్యాణ్ సాయం
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున వరద బాధితులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున వరద బాధితులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాలకు 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయని… ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని నిర్ణయించుకున్నా అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నాను అని తెలిపారు. ఇది కాకుండా ఏపీ ప్రభుత్వానికి ఆయన కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 6 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ సాయం చేయడం ఇప్పుడు సంచలనం అయింది.