రాహుల్ గాంధీకి.. పవన్.. వైలేంట్ స్ట్రోక్.. రేవంత్ ను బుట్టలో వేసేసాడా…?
ఏది ఏమైనా సంధ్య థియేటర్ ఘటన మాత్రం సెన్సేషన్. ఆ సెన్సేషన్ కూడా సాదాసీదా సెన్సేషన్ కాదు ఏకంగా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ను కూడా కెలికేసి మరో సెన్సేషన్ అయింది.
ఏది ఏమైనా సంధ్య థియేటర్ ఘటన మాత్రం సెన్సేషన్. ఆ సెన్సేషన్ కూడా సాదాసీదా సెన్సేషన్ కాదు ఏకంగా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ను కూడా కెలికేసి మరో సెన్సేషన్ అయింది. అల్లు అర్జున్ ఏ ముహూర్తంలో సంధ్య థియేటర్ ప్రీమియర్ షో కి వెళ్ళాడో తెలియదు గానీ అక్కడి నుంచి జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఏకంగా రాజకీయ పార్టీలను కూడా షేక్ చేసే రేంజ్ లో ఉన్నాయి. ఆ ఘటనను చాలా తక్కువ అంచనా వేసిన అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావడం ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అగ్రహానికి గురికావడం వంటివి కూడా జరిగాయి.
కాబట్టి మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ మరింత దూరం చేసింది. ఈ వ్యవహారంలో ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ అయితే నేషనల్ పాలిటిక్స్ లో కూడా సెన్సేషన్ అవుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వెయిట్ ఇస్తుంది. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ చూసి నేషనల్ మీడియా కూడా షాక్ అయింది. బిజెపి నేతలు కూడా ఒక రకంగా కంగుతిన్నారు. కాంగ్రెస్ నేతలు అయితే ఒక రకమైన డైలమాలో ఉండిపోయారు.
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసలు వర్షం కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను చాలా బాగా చూసుకుంటుంది అంటూ మాట్లాడారు. బెనిఫిట్ షోల విషయంలో గాని టికెట్ ధరలు పెంచే విషయంలో కానీ చాలా వెసులుబాటులు కల్పించిందని పోలీసులు కూడా చాలా సహకారం అందిస్తున్నారని… పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ విన్న చాలా మంది ఒక్కసారిగా కంగుతున్నారు.
జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఆ కామెంట్స్ చేసి ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు గాని ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి… ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక నేత. ఏపీ ప్రభుత్వంలో అత్యంత ప్రభావం చూపించే వ్యక్తి. అటువంటి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చూసి ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటే… బీజేపీ కార్యకర్తలు అసలు పవన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపున తెలంగాణలో బిజెపి.. రేవంత్ రెడ్డి పై పోరాటం చేస్తున్న సమయంలో ఆయన పాలన బాగుందంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం చూసి షాక్ అయ్యారు. అయితే ఇది రేవంత్ రెడ్డిని గత కొన్నాళ్లుగా సరిగా గమనిస్తున్న వాళ్లకు మాత్రం వింతగా ఏమీ అనిపించలేదు.
దీని వెనక కారణాలు చాలానే ఉన్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో కాస్త వెయిట్ ఉంటుంది. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి అలాగే సోనియాగాంధీ నివాసానికి మాత్రమే కాకుండా నేరుగా కేంద్ర మంత్రులు ఇళ్లకు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు వెళుతూ ఉంటారు. ఇక రాష్ట్రంలో బిజెపి నేతలు కూడా రేవంత్ రెడ్డి పై భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపణలు చేస్తే వీళ్ళు.. ముందుకు వచ్చి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
బండి సంజయ్ కిషన్ రెడ్డి… రఘునందన్ రావు వంటి వాళ్ళు పదేపదే రేవంత్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగానే కనబడుతూ ఉంటుంది. అటు కేంద్ర మంత్రులు… బిజెపి అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే కేంద్రం కూడా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం లేదనే చెప్పాలి. గత పదేళ్ళ నుంచి చూసుకుంటే ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగాని ఏ ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రి గానీ ఈ స్థాయిలో కంఫర్టబుల్ గా లేరు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతున్న విషయం.
దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలమైన నేతలకు గాలం వేస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఆయనను దగ్గర చేసుకోవడానికి ప్రాధాన్యతిస్తుంది. అందుకే నిధుల విషయంలో కూడా తెలంగాణను ఇబ్బంది పెట్టడం లేదు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ గమనిస్తున్న వాళ్లకు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పెద్దగా ఆశ్చర్యంగా ఏమీ అనిపించవు. అయితే పవన్ రేవంత్ రెడ్డి ని పొగడటం వెనుక చాలా కారణాలే ఉండి ఉండవచ్చు.
సినిమా పరిశ్రమను ఆయన ఇబ్బంది పెట్టకుండా చూడాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ లో ఉందేమో అనే భావన కూడా కలుగుతుంది. ఇక దీనిని కొంతమంది రేవంత్ రెడ్డిని బిజెపికి దగ్గర చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో చూస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే రాహుల్ గాంధీకి కచ్చితంగా ఇది షాక్ అంటూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని… రేవంత్ రెడ్డిని బిజెపికి దగ్గర చేసే బాధ్యతలను పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకున్నారంటూ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు.
అయితే ఈ కామెంట్స్ మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఒళ్ళు మండి రేవంత్ రెడ్డిలో అంత గొప్ప పరిపాలన మీకేం కనిపించిందంటూ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నేతలు అయితే పండగ చేసుకుంటున్నారు. భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి సహా కొంతమంది నేతలు వెంటనే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై రియాక్ట్ అయిపోయారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధమే ఉంటుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తూ ఉంటారు. ఇక అక్కడ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడాలా సినిమా కోణంలో చూడాలనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఏది ఎలా ఉన్నా రెండు పడవలపై రేవంత్ రెడ్డి కాలేసి ప్రయాణం చేయడం మాత్రం ఒక సెన్సేషన్.