పవన్ విత్ చంద్రబాబు, అసలేం జరుగుతోంది…?
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ బియ్యం రవాణాను కలెక్టర్ అడ్డుకోవడం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కాకినాడ పర్యటన... సీజ్ ది షిప్ అంటూ డైలాగ్స్ తో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ బియ్యం రవాణాను కలెక్టర్ అడ్డుకోవడం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కాకినాడ పర్యటన… సీజ్ ది షిప్ అంటూ డైలాగ్స్ తో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. ఈ తరుణంలో పవన్… సిఎం చంద్రబాబును కలుస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల లంచ్ భేటీ పై ఆసక్తి నెలకొంది. కాకినాడ పోర్ట్ లో పీ డీ ఎస్ రైస్ అక్రమ రవాణా పై ఇటీవల హల్ చల్ చేసారు పవన్.
పవన్ కాకినాడ పోర్ట్ పర్యటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ నుంచి బలవంతంగా అరబిందో కు 41 శాతం వాటా ఇవ్వడం పై విచారణ జరపాలని నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ డిమాండ్ చేసారు. ఇదే డిమాండ్ ను సీఎం ముందు డిప్యూటీ సీఎం ఉంచబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రం నుంచి విచ్చలవిడిగా ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది.
షిప్ ను సీజ్ చేసే అధికారాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. కస్టమ్స్ కు మాత్రమే ఆ అధికారం ఉంటుందంటున్న అధికార వర్గాలు… అక్రమ రవాణా జరిగితే ఆ ఎగుమతులు చేసిన వారిపైనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లంచ్ భేటీ తర్వాత ఉమ్మడి మీడియా సమావేశం ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.