PAWAN KALYAN: నాదెండ్ల సహా జనసేన నేతల అరెస్టు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్..
విశాఖలోని టైకూన్ జంక్షన్‌ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు నాదెండ్ల మనోహర్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి..?
PAWAN KALYAN: విశాఖపట్నం రాజకీయంతో అట్టుడుకుతోంది. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్‌ను మూసి వేయడంపై జనసేన శ్రేణులు ఆందోళనకు యత్నిస్తుంటే.. ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నాదెండ్ల బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే విశాఖలోని మరికొందరు జనసేన నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ARTICLE 370: ఆర్టికల్ 370 ఎప్పుడొచ్చింది..? ఎందుకు రద్దు చేశారు..? ఆసక్తికర విషయాలివే..
తమ పార్టీ నేతల అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘‘విశాఖలోని టైకూన్ జంక్షన్‌ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు నాదెండ్ల మనోహర్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి..? ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాం. నాదెండ్ల మనోహర్‌ను, జనసేన నేతలను తక్షణమే విడుదల చేయాలి. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తాను.
ప్రజల తరఫున పోరాడతాను’’ అని పవన్ ప్రకటించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషాలు ఉండటంతో టైకూన్ జంక్షన్ మూసివేసినట్లు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ జంక్షన్ మూసివేతతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేసేందుకు జనసేన ప్రయ్నతిస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు.