Pawan Kalyan: కృష్ణా నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర.. పొత్తు ప్రకటన తర్వాత తొలిసారి.. చంద్రబాబు అరెస్ట్ మీదే ఫోకస్..
పవన్ ఇప్పుడు నాలుగో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. మూడు యాత్రలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు అనిపించేలా ఉన్నాయ్ పరిణామాలు. నిజంగా ఈ విడత వారాహి యాత్ర చాలా ప్రత్యేకం. టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత చేస్తున్న తొలి పర్యటన ఇది. అన్నింటికి మించి హైలైట్ ఏంటంటే.. ఈసారి కృష్ణా జిల్లా నుంచి యాత్ర ప్రారంభం కావడం.
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో వారాహి యాత్ర రేపిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. వారాహిపై వస్తున్నా.. జనాల్లో ఒక్కడినై వస్తున్నా అంటూ.. యాత్ర మొదలుపెట్టిన పవన్‌కు.. మూడు విడతల్లోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ ఒక్క మాట మాట్లాడితే.. మినిమం నలుగురైదుగురు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి కౌంటర్లు ఇచ్చేవారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ యాత్ర ఎంత సక్సెస్ అయిందని ! అలాంటి పవన్ ఇప్పుడు నాలుగో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. మూడు యాత్రలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు అనిపించేలా ఉన్నాయ్ పరిణామాలు.
నిజంగా ఈ విడత వారాహి యాత్ర చాలా ప్రత్యేకం. టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత చేస్తున్న తొలి పర్యటన కావడం.. పైగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పవన్ గరంగరంగా ఉండడంతో.. ఈ యాత్రలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయనే చర్చ జరుగుతోంది. అన్నింటికి మించి హైలైట్ ఏంటంటే.. ఈసారి కృష్ణా జిల్లా నుంచి యాత్ర ప్రారంభం కావడం. వైసీపీ కీలక నేతల్లో చాలామంది కృష్ణా జిల్లాకు చెందిన వారే ! అలాంటి చోటు నుంచి పవన్ యాత్ర మొదలుపెట్టడం.. అదీ ఈ పరిస్థితుల్లో స్టార్ట్ చేయడం ఆసక్తకిరంగా మారింది. అక్టోబర్ ఒకటి నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు పవన్. ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా సాగనుంది. దీనికి సంబంధించి జనసేన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. మొదటి మూడు విడతలు.. వైసీపీని టార్గెట్ చేసిన పవన్.. నాలుగో విడతలో ఎలాంటి ప్రకటన చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని.. ఆ పొత్తుకు గల కారణాలను పవన్ వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐతే మొదటి మూడు విడతల యాత్రకు.. జనాల నుంచి అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో జనాలు వచ్చే చాన్స్ ఉంది. మొన్నటివరకు జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు మాత్రమే యాత్రకు హాజరయ్యేవారు. ఇప్పుడు టీడీపీ, జనసేన ఒకటి కావడంతో.. తెలుగు తమ్ముళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు పోలీసులు. మరి పవన్ యాత్రకు ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయ్. పోలీసులు అడ్డుకుంటారా.. ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.