Pawan Kalyan: సమాధానం చెప్తారా.. స్టిక్కర్ అంటిస్తారా? వైసీపీ సర్కార్‌పై జనసేనాని సెటైర్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో నిబంధనల్ని ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం నిర్ధరించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెబుతుందా.. లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తుందా అని సెటైర్ వేస్తూ పవన్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌పై సెటైర్లు పేల్చారు. రుషికొండపై తవ్వకాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చెట్లను నరికివేయడం.. కొండలు, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైఎస్సార్‌సీపీ దుష్ట పాలకుల హాల్ మార్క్ అంటూ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో నిబంధనల్ని ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం నిర్ధరించిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెబుతుందా.. లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తుందా అని సెటైర్ వేస్తూ పవన్ ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎపిసోడ్‌పైనా పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అంటే తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్ అన్నారు. త్యాగానికి, గౌరవానికి, ఆదర్శానికి ఓ గుర్తు అంటూ ట్వీట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో సురక్షితంగా ఉండాలన్నారు. తమ అభ్యర్థనలను పరిశీలించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రీసెంట్‌గా ఢిల్లీ పెద్దలతో రెండు రోజుల పాటు ఈ విషయం గురించి చర్చించానన్నారు పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.
మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు పవన్ కళ్యాణ్. ‘మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి” అంటూ అంబేద్కర్ చెప్పిన మాటలను పవన్ గుర్తు చేసుకున్నారు. అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన చివరి రోజు వరకూ కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అంటూ కొనియాడారు. ఆ మహానుభావుని మూలసూత్రాల ఆధారంగా జనసేన ప్రస్థానం సాగుతుందంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.