Pawan Kalyan: ఉత్తరాంధ్రపై పాలకులకు ప్రేమ లేదు.. వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న కోపం: పవన్ కళ్యాణ్
మూడోవిడత వారాహి యాత్ర సక్సెస్ అయ్యింది. ప్రభుత్వంపై కోపం, జనసేన పోరాటం ప్రజల్లో కనిపించింది. తెలంగాణ నుంచి ఆంధ్రావాళ్లను తరిమి వేయాలనే కోపం పెరగడానికి జగన్ కూడా కారణం. అందుకే వరంగల్‌లో విద్యార్దులు తరిమి కొట్టారు.
Pawan Kalyan: విశాఖలో చేపట్టిన మూడో విడత వారాహి యాత్ర విజయవంతం అయ్యిందని, ప్రభుత్వంపై కోపం జనంలో కనిపించిందన్నారు జనసన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి యాత్ర మూడో విడత ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తీవ్ర విమర్శలు చేశారు. “మూడోవిడత వారాహి యాత్ర సక్సెస్ అయ్యింది. ప్రభుత్వంపై కోపం, జనసేన పోరాటం ప్రజల్లో కనిపించింది. తెలంగాణ నుంచి ఆంధ్రావాళ్లను తరిమి వేయాలనే కోపం పెరగడానికి జగన్ కూడా కారణం. అందుకే వరంగల్‌లో విద్యార్దులు తరిమి కొట్టారు.
ఉత్తరాంధ్రను గుప్పెట్లో పెట్టుకోవడానికి తప్ప విశాఖ రాజధానిపై పాలకులకు ప్రత్యేకమైన ప్రేమ లేదు. జనవాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూదోపిడీలకు సంబంధించినవే. ఉత్తరాంధ్రపై నాకు అపారమైన ప్రేమ ఉంది. సహజవనరులు ఉండి కూడా ఇక్కడ నుంచి వలసలు జరుగుతున్నాయి. పొల్యూషన్ కారణంగా ఎదువుతున్న వ్యాధుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఏపీలో ఎవరితో పొత్తు పెట్టుకుంటామో త్వరలో తేలుతుంది. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడుతుందా..? లేక జనసేన, బీజేపీ కూటమి ఏర్పడుతుందా..? అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్‌లో బీహార్ కంటే ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయి. ఉత్తరాంధ్ర ప్రజలు, యువత ఒక విధంగా ఆలోచిస్తే నాయకత్వం మరో విధానంలో ఆలోచిస్తోంది. బాక్సైట్ పేరుతో లేటరైట్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అడ్డగోలుగా ఖనిజాలు తవ్వకాలు చేస్తే తీవ్ర నష్టం జరుగుతుంది.
అమ్మాయిల అదృశ్యంపై సమీక్ష ఏది..?
ఆడపిల్లల అదృశ్యంపై విచారణ జరుపుతామని కూడా పోలీసులు చెప్పలేకపోవడం ఇబ్బందికరం. చిత్తూరు ఎస్పీ నాకు క్లాస్ పీకే ప్రయత్నం చేశారు. అమ్మాయిల అదృశ్యంపై ఫిర్యాదులు రావడం లేదంటున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగితే తల్లిదండ్రుల పెంపకం లోపం అని హోంమంత్రి చెబుతున్నారు. ఆడపిల్లల అదృశ్యంపై ప్రభుత్వం సమీక్ష జరపలేదు. ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో రేసింగ్‌లు ఎక్కువయ్యాయి. నాతవరం మండలం బమిడికలొద్ధిలో లేట్రైట్ తవ్వకాల వెనుక టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం ప్రనేయం ఉందని నాకు రిపోర్ట్ ఉంది. రూ.15వేల కోట్ల ఖనిజాలు అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆటోడ్రైవర్ లక్ష్మణ రావు పేరుతో లీజుకు తీసుకుని బినామీలు తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రిమినాలిటీని లీగలైజ్ చేసేశారు. బ్రిటీష్ కాలం కంటే దారుణంగా విభజించే పాలించే విధానాన్ని ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్నారు.
రాయలసీమలో దోపిడీ సాధ్యం కానందునే ఉత్తరాంధ్రపై పడ్డారు. ప్రతీ పనికి రేట్ కార్డులు పెట్టి వైసీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు. మన్యంలో సహజవనరుల దోపిడీపై పోరాటం చేస్తాం. బీ ఫర్ బాంబ్.. ఎస్ ఫర్ స్కామ్ అని జగన్ పిల్లలతో రాయిస్తున్నారు. కానీ చదువుకోవడానికి స్కూళ్ళు లేవు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా నాణ్యమైన విద్య లభించడం లేదు. లిక్కర్, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడ్డ వారికి డీ ఆడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ర్రాష్టాన్ని పన్నుల మయం చేశారు. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు” అంటూ పవన్ వ్యాఖ్యానించారు.