మరో ఎస్పీపై పవన్ గురి…? పోస్టింగ్ ఊస్టింగ్, ఆర్డర్ రెడీ చేసిన చంద్రబాబు…?
కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది నిన్న కాకినాడ పర్యటనకు వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది నిన్న కాకినాడ పర్యటనకు వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు బియ్యం మాఫియా ఏ రేంజ్ లో ఉందో తనకు అర్థం కావడం లేదని, కనీసం తనను సీజ్ చేసిన పడవను కూడా చూడటానికి అధికారులు అనుమతించడం లేదని, అక్కడికి వెళ్తాను అంటే వాతావరణ సరిగా లేదని సాకులు చెప్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక ఈ అక్రమ్ బియ్యం తరలింపు వ్యవహారంలో పోలీస్ అధికారుల పాత్ర పై ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేక అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఈ అంశంపై నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మాట్లాడి పలు కీలక అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఇక స్థానిక అధికారుల పాత్ర విషయంలో పవన్ కళ్యాణ్ నిన్ననే అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాకినాడ ఎస్పీగా ఉన్నటువంటి విక్రాంత్ పాటిల్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం గా ఉన్నారట. తాను పర్యటనకు వెళుతున్నాను అని తెలిసి కూడా ఎస్పీ సెలవుపై వెళ్లడం పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.
సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తుంటే, అలాగే పౌరసరఫరాల శాఖ మంత్రి పర్యటనలో ఉన్నా సరే స్థానిక ఎమ్మెల్యేలు పర్యటనలో ఉన్న కనీసం ఎస్పీ బాధ్యతలు లేకుండా వ్యవహరించారని, కావాలని ఆయన సెలవులో ఉన్నారని అలాగే రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారంలో ఆయనకు కూడా ముడుపులు అందాయేమో అనే అనుమానాలను సీఎం చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. దీనితో ఇప్పుడు ఎస్పీ పని తీరుపై సీఎం చంద్రబాబు నివేదిక అడిగినట్లు సమాచారం. ఇక రేషన్ బియ్యం అక్రమ దండ వ్యవహారంపై అటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీరుపై కూడా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసారట.
జిల్లా ఇన్చార్జి మంత్రితో ఎప్పటికీ వ్యవహారంపై మాట్లాడి ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే చెక్ పోస్టుల వద్ద అన్ని విధాలుగా తనిఖీలు ఉన్నా సరే రేషన్ బియ్యం ఎలా వెళ్తుంది అనే దానిపై చంద్రబాబు అధికారులను నివేదిక అడిగినట్లు సమాచారం. 38 వేల టన్నుల అక్రమ రేషన్ బియ్యం రవాణా జరుగుతుంటే.. అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం వెనుక కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఇప్పుడు చంద్రబాబు ఆరా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలపై అధికారులను చంద్రబాబు నివేదిక అడిగినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమ రేషన్ బియ్యం రవాణా పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
అప్పుడు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ రవాణా వ్యవహారాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని అలాగే అప్పటి పౌరుసఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా ఇందులో వాటాలు తీసుకుంటున్నారని టిడిపి నేతలు కూడా ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన సరే అక్రమ దందా ఆగకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దాదాపు 150 కోట్ల విలువచేసే రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఎస్పీ పాత్ర పైనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంది.
దీంతో ఎస్పీని మార్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. పోలీసులు సహకారం లేకుండా అంత పెద్ద మొత్తంలో అక్రమ రేషన్ బియ్యం దందా జరగటం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మరి కొంతమంది అధికారులను అక్కడ నుంచి బదిలీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ముందుగా ఎస్పీపైనే ప్రభుత్వ పెద్దలు గురి పెట్టారు. ఎస్పీ సహకారం లేకుండా ఈ దందా సాధ్యం కాదని పవన్… చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారట.