ఢిల్లీలో నిప్పు పెట్టిన పవన్.. గల్లీ లో క్లాస్ పీకిన బాబు.

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు మంత్రుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అధికారుల పనితీరుపై కూడా క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 04:23 PMLast Updated on: Dec 04, 2024 | 4:23 PM

Pawan Kalyan Serious On Officers

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు మంత్రుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అధికారుల పనితీరుపై కూడా క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. అధికారులు కీలక సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులలో పని చేయాలనే తపన కనపడటం లేదంటూ ఫైర్ అయ్యారు.

ఇక మంత్రుల నుంచి కూడా పలు ఫిర్యాదులను చంద్రబాబు నాయుడు అందుకుని వాటిపై స్వయంగా అధికారులను నిలదీశారు. జలవనరుల, శాఖ అలాగే పౌరసరఫరాల శాఖ అధికారులపై చంద్రబాబు నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దృష్టికి పలు కీలక అంశాలను తీసుకువెళ్లినట్లుగా సమాచారం. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అమలు విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ డిపిఆర్ స్థాయి దాటి ముందుకెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక వెంటనే జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవటం లేదని ఢిల్లీలో కూడా ప్రచారం జరుగుతోందని దీనిపై తనను కేంద్ర మంత్రులు కూడా కొన్ని ప్రశ్నలు వేశారని తన వద్ద సమాధానాలు లేక చెప్పలేదు అంటూ పవన్ కళ్యాణ్.. చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు… రెవెన్యూ అధికారులలో బాధ్యత కనపడటం లేదని, లెక్కలేని సమాధానాలు ఇస్తున్నారని తనకు ఎదురైన అనుభవాలను పవన్ చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళారు.

ఇక ఆ తర్వాత జోక్యం చేసుకున్న మంత్ర లోకేష్ మిషన్ మోడ్లో పని చేస్తేనే పథకం అద్భుత ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలు విషయంలో నెల రోజుల్లోగా అనుకున్న లక్ష్యాలను అధికారులు సాధించే దిశగా అడుగులు వేయకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు. అలాగే మంత్రుల పనితీరుపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అధికారులతో పని చేయించే విషయంలో మంత్రులు విఫలమవుతున్నారని వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని, డిసెంబర్ 12 కు ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో సెల్ఫ్ అసెస్మెంట్ సమర్పించాలని మంత్రులకు సూచించారు.

మంత్రుల సెల్ఫ్ అసెస్మెంట్ చూసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తానని స్పష్టం చేసినట్లుగా సమాచారం. అలాగే ఓ మహిళ మంత్రిపై కూడా చంద్రబాబు ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనవసర విషయాలలోనూ సివిల్ తగాదాల్లో మంత్రులు గాని మంత్రుల బంధువులు గాని తలదూర్చకూడదు అని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించాలని చంద్రబాబు స్పష్టం చేసారు. కొందరు విజయవాడ, గుంటూరులోనే ఉంటున్నారని… మిమ్మల్ని చూసి అధికారులు కూడా అదే అలవరుచుకుంటున్నారని మండిపడ్డారట చంద్రబాబు.