Top story: పవన్ అంటే లోకల్ పవర్ అనుకుంటివా.? నేషనల్ పవర్
మరాఠా గడ్డ మాజీ అల్లుడు 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపాడు... మరాఠా ప్రజల ఎమోషన్స్ ను క్యాచ్ చేసి అక్కడి యూత్ ను తన స్పీచ్ తో ఓ ఊపు ఊపాడు. తనపై బిజేపి అగ్ర నాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ విక్టరీలో కీ రోల్ ప్లే చేసాడు.
మరాఠా గడ్డ మాజీ అల్లుడు 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపాడు… మరాఠా ప్రజల ఎమోషన్స్ ను క్యాచ్ చేసి అక్కడి యూత్ ను తన స్పీచ్ తో ఓ ఊపు ఊపాడు. తనపై బిజేపి అగ్ర నాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ విక్టరీలో కీ రోల్ ప్లే చేసాడు.
ఏపీ ఎన్నికల్లో 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ తో సూపర్ విక్టరీ కొట్టిన జనసేనాని, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్… మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా షార్ట్ టైం లో సూపర్ హిట్ కొట్టారు. కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల్లో బిజేపి తరుపున ప్రచారానికి దిగిన జనసేనాని సత్తా చాటారు. మహారాష్ట్ర ఎన్నికలలో… బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తున్న 5 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి… ఓటర్లను ప్రభావితం చేసారు. పవన్ చేసిన ప్రతీ నియోజకవర్గంలో బిజేపి సూపర్ విక్టరీ కొట్టింది. అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ తో సక్సెస్ అయ్యారు.
సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకుని ప్రచారం చేయడమే కాకుండా… అక్కడ ఉన్న తెలుగువారిని ఆకట్టుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. బిజెపి విధానాలను పవన్ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళేలా ప్రసంగించారు. దీనితో పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ హిట్ కొట్టింది. పవన్ భుజానికి ఎత్తుకున్న సనాతన ధర్మం కేవలం తెలుగు వారినే కాదు మరాఠీలను కూడా ఆకట్టుకుంది. దీనితో నార్త్ లో కూడా పవన్ డామినేషన్ స్టార్ట్ అయింది అంటూ… ఓ వైపు జనసైనికులు మరోవైపు… బిజెపి కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.
ఆయనతో కీలక రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయించాలి అంటూ కోరుతున్నారు. జాతీయ మీడియాలో కూడా పవన్ కాంపైన్ గురించి చర్చా వేదికల్లో పెద్ద ఎత్తున మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ను ప్రయోగించిన బిజేపి సూపర్ సక్సెస్ అయిందని… పవన్ ఇమేజ్ బిజేపి ఊహించిన దానికంటే ఎక్కువగా అడ్వాంటేజ్ అయింది అంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారు. పూణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ లలో బిజేపి తరుపున పవన్ ప్రచారం చేసారు.
డెత్లూర్ లో ఇప్పటి వరకు బిజేపి విజయం సాధించలేదు. కాని పవన్ దెబ్బకు అక్కడ ఖాతా తెరిచింది. మహాయుతి కూటమి బంపర్ మెజారిటీ సాధించడం వెనుక పవన్ కృషి కూడా తోడు అయింది అంటూ జాతీయ మీడియా చర్చా వేదికల్లో చర్చించడం హైలెట్ అయింది. పవన్ ప్రచారం చేయడంతో కేవలం 5 నియోజకవర్గాలలోనే కాకుండా తెలుగు వారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మహాయిత కూటమికి అడ్వాంటేజ్ అయింది. విమర్శలకే కాకుండా ఎన్డియే విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు పవన్.
ఇక ఈ ఎన్నికల్లో పవన్ వ్యాఖ్యలు బాగా ఫేమస్ అయ్యాయి. సొంత ప్రసంగాలతో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. జాతీయ అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో పవన్ బాగా సక్సెస్ అయ్యారు. ఎన్డియే ప్రభుత్వం తీసుకున్న బలమైన నిర్ణయాలపై పవన్ కీలక ప్రసంగాలు చేసారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం వంటి అంశాలపై బిజేపి నేతలకు మించి పవన్ ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రసంగించారు. మరాఠీ ప్రజల ఆరాధ్య దైవంగా చెప్పుకునే… ఛత్రపతి శివాజీ గురించి పవన్ ప్రసంగాలు అక్కడి యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా పవన్ అభివర్ణించడం హైలెట్ అంశంగా చెప్పాలి.
శివసేన రెండుగా చీలినా… ఎన్డియే వైపు… శివసేన అభిమానులు, కార్యకర్తలు నిలబడటంలో పవన్ తన వంతు పాత్ర పోషించారు. బాలా సాహెబ్ థాక్రే పై తనకు ఉన్న అభిమానాన్ని పవన్ చాటుకున్నారు. ఇక తెలంగాణాలో మజ్లీస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పవన్… మహారాష్ట్రలో హైలెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని హైదరాబాద్‌లో కొందరు నేతలు అంటున్నారన్న పవన్… అలాంటి ప్రభుత్వాలు వద్దని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా.. కలిసి బలంగా నిలబడదామా అంటూ పవన్ మరాఠా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఓ ఊపు ఊపింది. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా.. కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా అంటూ పవన్ యూత్ ను ఆకట్టుకునేలా ప్రసంగించారు. ఇక ప్రధాని మోడీపై పవన్ చేసిన ప్రసంగం కూడా హైలెట్ గా నిలిచింది. ఇలా మరాఠా గడ్డ మాజీ అల్లుడు… అక్కడి ప్రజలను ఫిదా చేస్తూ ఎన్డియే విజయంలో కీ రోల్ ప్లే చేయడంతో బిజేపి నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.