రంగుల ఖర్చు ఇదే: సభలో పవన్ లెక్కలు
పంచాయితీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయితీల్లో డంపింగ్ యార్డ్ ల నిర్వహణ అవసరాన్ని గుర్తించామన్నారు.

పంచాయితీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయితీల్లో డంపింగ్ యార్డ్ ల నిర్వహణ అవసరాన్ని గుర్తించామన్నారు. డంపింగ్ యార్డ్ లో నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపిన పవన్… స్కూల్స్ ఏర్పాటు చేయడానికే సెంటు భూమి లేని పంచాయితీలు ఉన్నాయన్నారు. ఈ నేపధ్యంలోనే 10,15 పంచాయితీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే డంపింగ్ యార్డ్ ల ఏర్పాటు, నిర్వహణ పై ఒక విధానం తీసుకొస్తామన్నారు.
పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి 101 కోట్లు ఖర్చు అయిందని తెలిపిన ఆయన ఇందులో రంగులు వేయడానికి 49 కోట్లు అయ్యాయన్నారు. వాటిని తొలిగించి తిరిగి రంగులు వేయడానికి 52 కోట్లకు పైగా ఖర్చైందని పేర్కొన్నారు.