షర్మిలకు మేమున్నాం, అప్పుడు ఈవీఎంలు లేవా: పవన్
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసిపి వాళ్లకు చింత చచ్చినా పులుపు చావలేదన్నారు.
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసిపి వాళ్లకు చింత చచ్చినా పులుపు చావలేదన్నారు. 11 సీట్లకు వచ్చినా వాళ్ళ నోరు ఆగట్లేదని మండిపడ్డారు. నీ ఇష్టానికి సోషల్ మీడియాలో నన్ను తిడతాం, కుటుంబ సభ్యుల్ని తిడతాం అంటే స్వామి మీద ఆన… అంటూ హెచ్చరించారు. గెలిచిన రోజునే చెప్పాను ఇది పగ ప్రతీకారాల ప్రభుత్వం కాదని… ఇది మంచి ప్రభుత్వమే కానీ నటన ప్రభుత్వం కాదని స్పష్టం చేసారు. తొక్కి నారా తీస్తాము త్వరలో మీరు చూస్తారన్నారు.
యుద్ధమే కావాలంటే మీకు కోరినంత ఇస్తానన్నారు పవన్. సంక్షేమ హాస్టల్లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడమని అధికారులకు చెప్పా అని పిఠాపురం ఒక్కటే నా సొంతం కాదు అంటూ పేర్కొన్నారు. ఆడబిడ్డల మానప్రాణాలకు ఏ తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో ఆడపిల్లలలో నీచంగా చూపిస్తే ఊరుకోo అని హెచ్చరించారు. త్వరలో రక్షణ కోసం డిజిటల్ ప్రైవసీ ఆక్ట్ వస్తుంది అన్నారు. ఓ నాయకుడు సొంత సోదరి నా ప్రాణానికి రక్షణ కావాలని అడుగుతుందని… మీ ప్రాణానికి మా ప్రభుత్వం రక్షణగా ఉంటుందని ఆయన షర్మిలను ఉద్దేశించి కామెంట్స్ చేసారు.
అప్రమత్తంగా ఉండాలని టిడిపి జనసేన బిజెపి శ్రేణులకు చెబుతున్నాను అన్నారు. అరాచక శక్తులు కుల, మత ఘర్షణలు సృష్టించవచ్చని తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులను హెచ్చరిస్తున్న అన్న పవన్… దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు, కుల గర్షణలు రెచ్చగొట్టే పనులు చేస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. స్కూల్స్ లో ఆడపిల్లల భద్రత చాలా ముఖ్యమన్నారు. వైసీపీ నాయకులకు, మద్దతు దారులకు చెప్తున్న,నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాళ్ళు విరగ కొట్టి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. కొత్తగా ఈవీఎంలు మోసం చేశాయని వైసిపి నాయకులు చెబుతున్నారు అని 154 వచ్చినప్పుడు ఈవీఎంలు మోసం చేయలేదు, 11 వస్తే ఈఎంలు మోసం చేశాయంట అని ఎద్దేవా చేసారు.