Pawan Kalyan: పవన్ నోట తెలంగాణం.. జనసేనాని అసలు వ్యూహం ఏంటి ?

తెలుగు రాష్ట్రాల రాజకీయం రోజు రోజు కి రసవత్తరంగా మారుతోంది. ఎవరి రాష్ట్రంలో వాళ్ళు రాజకీయ యుద్ధం చేసేవాళ్ళు ఇన్నాళ్లు.. ఇప్పుడు సీన్ మారింది. రెండు రాష్ట్రాల అధికార పార్టీలు యుద్దానికి దిగుతున్నాయి. తెలంగాణ మంత్రి హరీశ్ ఓ మాట అన్నారని.. ఆంధ్రప్రదేశ్ మంత్రులంతా విరుచుకుపడ్డారు. సీదిరిలాంటి వాళ్ళు అయితే కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అయితే దీని చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. అక్కడ మాత్రం అంతకుమించి అనిపిస్తోంది సీన్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2023 | 03:40 PMLast Updated on: Apr 17, 2023 | 3:58 PM

Pawan Kalyan Supports Telangana Peoples

జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ విషయంలో వైసీపీని టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. కాకపోతే ఈ సారి రూట్ మార్చి తెలంగాణ ప్రభుత్వానికి మద్ధతు తెలిపి.. ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హరీశ్ వెర్సెస్ ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నట్లు సాగుతున్న యుద్ధంలోకి పవన్ వచ్చేశారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికారంగా మారింది. వాళ్ళని వీళ్ళు.. వీళ్ళని వాళ్ళు ఏమంటున్నారు అన్న సంగతి పక్కన పెడితే.. ఇష్యూ జరిగిన ఇన్నాళ్లకు పవన్ ఎందుకు రియక్ట్ అవుతున్నారు. అయితే అయ్యారు.. తెలంగాణకి మద్దతుగా ఇప్పటికిప్పుడు రాగం ఎందుకు అందుకున్నారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఆసక్తిరేకిస్తుంది.

నాలుగు రోజులు తర్వాత ఈ రచ్చ మీద పవన్ రెయాక్ట్ అయ్యారు. తెలంగాణ ఆత్మగౌర‌వం దెబ్బతిసేలా ఏపీ మంత్రులు మాట్లాడడం బాధించిందని.. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని.. ఒక వ్యక్తిని విమర్శించాలి తప్ప తెలంగాణ జనాలను మధ్యలో ఎందుకు లాగుతున్నారని, తెలంగాణ జనాలకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏపీ మంత్రులు హరీష్ రావుకే కౌంటర్లు ఇచ్చారు తప్ప..తెలంగాణ ప్రజలని ఎక్కడ కించపర్చలేదని, అవేమీ తెలియకుండా పవన్ గుడ్డిగా కావాలని వైసీపీపై విమర్శలు చేస్తున్నారని, ఫ్యాన్ పార్టీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. రాజకీయం అంతా ఎలా ఉన్నా.. పవన్ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

తెలంగాణలో పార్టీని ఎన్నికల బరిలో దింపేందుకు పవన్ రెడీ అయ్యారని.. ఇలాంటి కామెంట్స్ తో ఆయన సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి వారాహికి కొండగట్టు లో పూజలు నిర్వహించినప్పుడు.. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు పవన్. 7అసెంబ్లీల్లో పోటికి దిగుతామని క్లారిటీ ఇచ్చారు. అయితే అంత సీన్ లేదు లే అని అంతా కొట్టి పారేశారు అప్పుడు. తెలంగాణలో పోటీ విషయంలో పవన్ సీరియస్ గా అన్నారని.. ఇప్పుడు మాటలతో అర్ధం అవుతోంది.

నిజం గా అదే నిజం అయితే ఆ పోటీ ఎలా ఉంటుంది అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రీ బౌన్స్ కావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీతో పొత్తుకు కనసేన రెడీ అవుతోంది. అన్ని కుదిరి పొత్తులు జరిగితే.. ఇక్కడ కూడా సైకిల్ తో ప్రయాణం చేస్తుందా అన్నది తేలాలి. పవన్ ప్రస్తుత కామెంట్స్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఓ అంచనా కి వచ్చే పరిస్థితి లేకున్నా .. తెలంగాణ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని.. సేనాని మాటలతో క్లియర్ గా అర్థం అవుతోంది.