గూగుల్ సెర్చ్ లో మనోడే టాప్, గ్లోబల్ లీడర్ పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో సెన్సేషన్ అవుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నార్త్ ఇండియా లో కూడా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2024 | 07:17 PMLast Updated on: Dec 11, 2024 | 7:17 PM

Pawan Kalyan Tops Google Search Global Leader

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో సెన్సేషన్ అవుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నార్త్ ఇండియా లో కూడా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అలాగే కర్ణాటకకు కాస్త తమిళనాడుకు మాత్రమే పరిమితమైన పవన్ కళ్యాణ్… ఇప్పుడు నార్త్ ఇండియా లో కూడా ఫేమస్ అయిపోయాడు. స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి ఫేమస్ అవుతుంటే ఒక్క ఎలక్షన్ క్యాంపైతో పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియాను షేక్ చేస్తున్నాడు.

భారతీయ జనతా పార్టీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఢిల్లీలో కూడా పలు రాజకీయ పార్టీలు అలాగే అక్కడి మీడియా మాట్లాడుకుంటుంది. జాతీయ మీడియాలో ఒక తెలుగు నాయకుడి గురించి డిబేట్ లు పెట్టడం బహుశా ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. పవన్ కళ్యాణ్ వచ్చి ఎన్నికల ప్రచారం చేయడాన్ని జాతీయ మీడియా కాస్త సీరియస్ గానే తీసుకుని డిబేట్ లు పెట్టింది. అక్కడి నాయకులు కూడా పవన్ ను క్రౌడ్ పుల్లర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను సర్వే సంస్థలు కూడా ఆకాశానికి ఎత్తేసాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ గూగుల్ లో కూడా తన డామినేషన్ చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేశారు. వరల్డ్ వైడ్ గా వ్యక్తులు జాబితాలో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈవెంట్స్ విషయంలో మొదటి స్థానంలో ఐపీఎల్ ఉండగా వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్ లో ఉండటం చూసి సినీ వ్యాపార ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ ను ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్ లో ఎవరు సెర్చ్ చేయలేదు.

అలాగే ఈ రేంజ్ లో గూగుల్ లో సెర్చ్ చేసిన మొదటి సినిమా నటుడు కూడా పవన్ కళ్యాణ్ కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయ్యారు. కాకినాడ పర్యటనలో ఆయన నుంచి వచ్చిన “సీజ్ ది షిప్ అనే” ఒక డైలాగ్ కు సినిమా వాళ్లు కూడా షేక్ అయ్యారు. ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేసారు. సినిమాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాస్త స్పీడు పెంచారు. మూడు సినిమాలను ఎప్పుడో లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేసేందుకు పవన్ కష్టపడుతున్నారు. ఓవైపు పరిపాలన మరోవైపు రాజకీయ పార్టీ అలాగే కుటుంబం సినిమాలు అంటూ పవన్ బిజీ బిజీగా ఉన్నారు.