పిచ్చి వేషాలు వేస్తే తొక్క తీస్తా: పవన్ వార్నింగ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. పిఠాపురంలో నాకు ఉన్న స్థలంలోనే షెడ్లు వేసుకుని… ఇక్కడే ఉండి ప్రతి గ్రామానికి వెళ్తానని అన్నారు. ప్రతీ ఒక్కరు తనకు తెలియాలన్నారు. 14 రోజులు ఇక్కడే ఉండి 54 గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు.
పిఠాపురంలో దొంగతనాలు పెరిగాయి.. గంజాయి వాడకం పెరిగింది.. తుని నుండి వచ్చిన కొందరు మారుస్తున్నారు… అని నా దృష్టికి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. పిఠాపురం నియోజకవర్గం లో ఈవిటిజింగ్ పెరిగిపోయింది అని పలు ఫిర్యాదులు వచ్చాయని.. రాత్రి వేళల్లో బైక్ విన్యాసాలు పెరిగాయన్నారు. పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు పవన్. సీటిల్మెంట్లు పోలీస్ స్టేషన్ లో కాకుండా లాయర్ ల వద్ద పెట్టండని సూచించారు.
తిరుపతిలో డిఎస్పీ సరిగ్గా పని చేసి ఉంటే ఎస్పీ బలి అయ్యేవారు కాదన్నారు. నాలాంటి వాడు రోడ్డు మీదకు వస్తే ఎవరికి నిద్రాహారాలు ఉండవన్న పవన్ గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నా నియోజక వర్గం పిఠాపురంలో ఆడపిల్లలపై ఇవిటీజింగ్ చేస్తే తొక్కి నారా తీస్తా పిచ్చా వేషాలు వేస్తే అంటూ ఫైర్ అయ్యారు పవన్. పిఠాపురం నియోజక వర్గంలో క్రిమినల్స్ కి కులం లేదు… ప్రజా ప్రతినిధులకు కులం లేదన్నారు.