అధికారులకు పవన్ మాస్ వార్నింగ్

తన పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్న అధికారిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై మాట్లాడుతూ ఇది లంచాల ప్రభుత్వం కాదు... ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 12:50 PMLast Updated on: Oct 14, 2024 | 12:50 PM

Pawan Kalyan Warning To Govt Officers

తన పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్న అధికారిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై మాట్లాడుతూ ఇది లంచాల ప్రభుత్వం కాదు… ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేసారు. మా పేరు చెప్పు డబ్బులు డిమాండ్ చేయటం సరైన విధానం కాదన్నారు. మేము ఎంత బాగా చేస్తున్నా కొంతమంది అధికారులు తీరులో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగాఉండాలి అని ఆయన స్పష్టం చేసారు.

మాతో పాటు అధికారులు కూడా నిజాయితీగా ఉండాలి.. లంచం తీసుకున్న అధికారిపై వెంటనే చర్యలకు ఆదేశించామన్నారు పవన్. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం అని తెలిపారు. అందుకే కలిసి పోటీ చేయాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించాలి.. టీడీపీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయం వల్ల ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

ప్రజలు తమ పంచాయతీల్లో ఏం పనులు జరగాలో వాళ్లే తీర్మానం చేసుకున్నారన్నారు పవన్. గ్రామంలో ఎంత ఖర్చు పెట్టాం, ఏయే పనులు జరుగుతున్నాయో.. డిస్‌ప్లే బోర్డులు ఉండాలి అని అధికారులను ఆదేశించారు. పరిపాలన వేరు.. పాలిటిక్స్‌ వేరు అన్నారు పవన్. కచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని తెలిపారు.