గేమ్స్ ఆడవద్దు: టీడీపీ నేతలకు పవన్ వార్నింగ్
ఆడపిల్లల మన ప్రాణ సంరక్షానికి బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ నీ అరెస్ట్ చేయడానికి పోలీసులు ముందు ఉండే పోలీసులు ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేస్తే ఏం చేస్తున్నారు అని నిలదీశారు

ఆడపిల్లల మన ప్రాణ సంరక్షానికి బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ నీ అరెస్ట్ చేయడానికి పోలీసులు ముందు ఉండే పోలీసులు ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేస్తే ఏం చేస్తున్నారు అని నిలదీశారు. సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతాం అంటే కుదరదు అని అందుకే జనసేన పార్టీని స్థాపించా అని పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలాగ పోలీసులు అలసత్వంగా ఉండొద్దు అని చెప్తున్న అని హెచ్చరించారు.
సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు, ఎన్డియే కూటమి నేతలు వెళ్లి చూసారా…? జనసేన నేతలు వెళ్లి చూసారా అని ప్రశ్నించారు. ఓడిపోయే సమయంలో ప్రజలు మనకు అండగా నిలబడ్డారు అధికారంలోకి వచ్చాం కదా అని మర్చిపోకూడదు… నాకు ఆ సరదా లేదు అని స్పష్టం చేసారు. వ్యక్తి స్వార్థానికి ఎవ్వరూ అలయెన్స్ నీ చెడగొట్టలేరని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనసేన టీడిపి బిజెపి నేతలకు ఒకటే చెప్తున్న వ్యక్తిగత గేమ్స్ ఎవ్వరూ ఆడవద్దు అని హెచ్చరించారు.