PAWAN KALYAN: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం.. 22న వరంగల్‌లో రోడ్డు షో..!

వరంగల్ జిల్లాలో ఈ నెల 22న పవన్ కల్యాణ్‌ను ప్రచారం చేయబోతున్నారు. ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు అవకాశాన్ని బట్టి తూర్పు నియోజకవర్గంలో కూడా రోడ్డు షోలు నిర్వహించే వీలుందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 01:49 PMLast Updated on: Nov 20, 2023 | 1:49 PM

Pawan Kalyan Will Attend Public Meeting In Warangal For Support Bjp

PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఉన్న చోట పవన్ కల్యాణ్‌తో ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఫోకస్ పెట్టింది. వరంగల్ జిల్లాలో ఈ నెల 22న పవన్ కల్యాణ్‌ను ప్రచారం చేయబోతున్నారు. ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు అవకాశాన్ని బట్టి తూర్పు నియోజకవర్గంలో కూడా రోడ్డు షోలు నిర్వహించే వీలుందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.

Vijayashanthi : తగ్గేదేలే అంటున్న రాములమ్మ.. జెట్ స్పీడ్ తో కాంగ్రెస్ కి ప్రచారం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. గెలుపు అవకాశాలున్న స్థానాలకు చెందిన అభ్యర్థులతో అధిష్ఠానం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. జనాల్లో పార్టీ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్త పడుతోంది. దీనిలో భాగంగా అలాంటి నియోజకవర్గాలకు పార్టీ అగ్రనేతలను పంపించి, ప్రచారం నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న ఖిలా వరంగల్‌లో నిర్వహించిన సభల్లో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ, బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. కాగా నేడు మరోసారి అమిత్ షా ఉమ్మడి జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరవుతారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ప్రచారానికి వస్తుండటంతో బీజేపీ నేతల్లో జోష్ పెరిగింది. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు.

ఈ నెల 22న వరంగల్ నగరంలో ప్రచారం పాల్గొనేందుకు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రావు పద్మ పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారు. నగరంలో రోడ్డుషో నిర్వహించి ప్రసగించస్తారు. పవన్ పర్యటన కోసం నియోజకవర్గ నేతలు విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పవన్ ప్రచారం పార్టీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.