PAWAN KALYAN: ప్రచారానికి సిద్ధమవుతున్న పవన్.. ప్రత్యేక కమిటీల ఏర్పాటు..
జనసేనాని కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసేందుకు ప్రాంతాలవారీగా ప్రత్యేక కమిటీలను నియమించింది జనసేన.
PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ప్రస్తుతం ఎన్నికలపైనే దృష్టిపెట్టారు. కొంతకాలంగా సినిమా షూటింగులను కూడా నిలిపివేశారు. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీతోపాటు పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం.. రా కదలి రా.. అంటూ ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు.
AYODHYA RAM MANDIR: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం మోదీ కఠినమైన దీక్ష..
వైసీపీ అధినేత జగన్.. నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. దీంతో జనసేనాని కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసేందుకు ప్రాంతాలవారీగా ప్రత్యేక కమిటీలను నియమించింది జనసేన. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆ వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం.. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేశారు . ప్రతీ జోన్‌లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పవన్ పర్యటనలకు ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగించింది. ఈసారి కూడా అలాంటి ఆటంకాలే సృష్టించే అవకాశం ఉంది.
అందుకే.. ప్రతి చోటా ముుందుగానే అనుమతులు తీసుకునేలా న్యాయపరమైన అంశాల కోసం ప్రత్యేక లాయర్ల బృందాన్ని కూడా జనసేన ఏర్పాటు చేసుకుంటోంది. అలాగే.. ప్రచారంలో భాగంగా.. ఎవరికి, ఎలాంటి ప్రమాదం జరిగినా.. తక్షణ వైద్య సాయం కోసం అందేలా వైద్య బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పవన్ వారాహి విజయ యాత్ర పూర్తి చేసిన సంగతి తెలిసిందే. భయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ, కృష్ణా జిల్లాలో పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే పర్యటన షెడ్యూల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది.
జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు జోనల్ కమిటీలు pic.twitter.com/xc4giOYD7a
— JanaSena Party (@JanaSenaParty) January 20, 2024