PAWAN KALYAN: ఎంపీగా పవన్.. కేంద్రమంత్రిగానూ చాన్స్.. అమిత్ షా పెద్ద ప్లానే వేశారుగా..
పదేళ్లుగా రాజకీయాలు చేస్తున్న పవన్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేదు. ఐతే ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది. ఎంపీగా పోటీ చేయాలని కమలం పార్టీ పెద్దలు సూచించడంతోనే.. పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
PAWAN KALYAN: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య.. ఎట్టకేలకు లెక్క తేలింది. పొత్తు కుదిరింది. బీజేపీ, జనసేనకు కలిపి 8 పార్లమెంట్ స్థానాలు.. 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు.. టీడీపీ రెడీ అయింది. బీజేపీ 6 ఎంపీ, జనసేన 2 స్థానాల్లో ఎంపీగా పోటీ చేయబోతుండగా.. జనసేన 24, బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది. ఐతే ముందు నుంచి ఊహించినట్లే.. పవన్ ఎంపీగా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాడు. కాకినాడ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Radhika Merchant: అంబానీ కోడలంటే అట్లుంటది మరి.. బంగారంతో తయారు చేసిన లెహంగాతో రాధికా..!
కాకినాడలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడం.. జనసేనకు బలం కూడా పెరిగింది అనే సర్వేలతో సేనాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా రాజకీయాలు చేస్తున్న పవన్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేదు. ఐతే ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది. ఎంపీగా పోటీ చేయాలని కమలం పార్టీ పెద్దలు సూచించడంతోనే.. పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీని వెనక బీజేపీ భారీ ప్లాన్ కనిపిస్తోంది. ఏపీలో 2029నాటికి బలమైన పార్టీగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసిందనిపిస్తోంది. దీనికోసం పవన్‌ను ముందు పెట్టి స్ట్రాటజీలు అమలు చేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. పవన్‌ను బలమైన శక్తిగా నిలబెట్టేందుకు అమిత్ షా భారీ వ్యూహమే రచించినట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. రెండు పార్టీల అధినేతలతో జరిగిన భేటీలో.. కాకినాడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని స్వయంగా అమిత్‌షాకు పవన్‌కు సూచించారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
గెలిచిన తర్వాత కేంద్ర కేబినెట్‌లో కీలకమైన శాఖ కూడా అప్పగించేందుకు బీజేపీ సిద్ధం అయిందనే టాక్ నడుస్తోంది. పవన్ లోక్‌సభకు పోటీ చేసి గెలిస్తే.. ఆయనకు మోదీ క్యాబినెట్‌లో కీలకమైన మంత్రిత్వ శాఖను కేటాయించి.. ఏపీలో చంద్రబాబుతో సమానంగా రాజకీయాలను శాసించేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి హోదాలో ఏపీ రాజకీయాల్లో.. ఢిల్లీ స్థాయిలో పవన్ ఫోకస్ పెట్టేందుకు వీలవుతుందని.. కేంద్రమంత్రి అనే కారణంతో.. అటు అభిమానుల్లో, ఇటు జనసేన కార్యకర్తల్లో, జనాల్లో.. పవన్‌కు మరింత గుర్తింపు, అభిమానం లభిస్తాయని బీజేపీ భావిస్తోంది.