PAWAN KALYAN: పిఠాపురం నుంచే పవన్ పోటీ.. ఎందుకంటే..
నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఐతే చాలా కసరత్తు తర్వాత పిఠాపురం వైపే పవన్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు దాదాపు 91వేల మంది ఉన్నారు.

Jana Sena leader Pawan Kalyan who gave 10 crores
PAWAN KALYAN: జనసేనాని పవన్ పోటీ చేయబోయే అసెంబ్లీ నియోజకవర్గంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. భీమవరం నుంచి పోటీ చేస్తారని కొందరు.. కాకినాడ పార్లమెంట్ బరిలో ఉంటారని మరికొందరు.. ఇలా కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు చెక్ పడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలని పవన్ నిర్ణయించుకునట్లు తెలుస్తోంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది.
EETALA MALKAJ GIRI : ఈటల రాజేందర్ కే మల్కాజ్ గిరి టిక్కెట్ ! బీజేపీ క్లారిటీ ఇచ్చినట్టేనా ?
ఐతే చాలా కసరత్తు తర్వాత పిఠాపురం వైపే పవన్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు దాదాపు 91వేల మంది ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీచేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇలా అన్ని అంచనాలతోనే.. పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే.. ఆ ప్రభావంతో కాకినాడ రూరల్, ఎంపీ స్థానం కూడా ఈజీగా గెలవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది. పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొనసాగుతున్నారు. ఈయనకు బలమైన నేతగా పేరుంది. అయితే పిఠాపురం సీటును ముందు జనసేన కోరినప్పుడు.. వర్మను దృష్టిలో ఉంచుకుని వేరే నియోజకవర్గాన్ని అడగాలని టీడీపీ కోరింది.
ఐతే జనసేన ఈ సీటుపై పట్టుబట్టడం, అది కూడా స్వయంగా పవన్ పోటీచేయాలని నిర్ణయించడంతో చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల కోసం జనసేన మొదటి నుంచీ.. కాకినాడ జిల్లాపైనే ఎక్కువ దృష్టిసారించింది. గతేడాది పవన్ ప్రారంభించిన తొలివిడత వారాహి యాత్ర కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఆ సమయంలో పిఠాపురంలో రెండ్రోజులు బస చేశారు కూడా. ఇక్కడ పార్టీ ఆఫీసు కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అక్కడి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు.