బాలయ్య విత్ పవన్… ఆహా రిలీజ్ ప్లానింగ్ అదే
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి త్వరలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి త్వరలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. త్వరలోనే ఈ షోలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి ఏ షోకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఏపీ ఒక ముఖ్యమంత్రి కావడంతో మరోసారి హాజరు కావాలని ప్లాన్ చేసారట. గత ఆరు నెలలుగా ప్రభుత్వంలో తనకున్న అనుభవాలను పంచుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.
ఆహా యాజమాన్యం కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరిపింది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ కానుంది. సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్ పాల్గొన్న ఎపిసోడ్ని త్వరలోనే రిలీజ్ చేస్తారు. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ కి షోలో పాల్గొన్నాడు. ఇప్పటికే హీరో వెంకటేష్ ఈ షోలో పాల్గొనగా ఆ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఎపిసోడ్ పై కూడా చాలా హైప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా షోకి మళ్ళీ మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని వాడుతున్నారు అనే ఒపీనియన్ వినపడుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఒపీనియన్ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా షోలో పాల్గొనే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటుగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ షో కి అటెండ్ అవుతారట. మరో వారం రోజుల్లో ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేసి ఈనెల 10 లేదా 11వ తేదీన దానికి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు.
ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవి రిలీజ్ కు సిద్ధంగా లేవు. ప్రస్తుత ఆయన నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు ఉందట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఆ తర్వాత ఓ జి సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. ఏది ఎలా ఉన్నా ఈ షో కి పవన్ కళ్యాణ్ రెండోసారి రావడం మాత్రం ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో గత ఆరు నెలలుగా ఆయన నేషనల్ మీడియాలో కూడా సెన్సేషన్ అయ్యారు. తొలిసారి ప్రభుత్వంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సెన్సేషన్ అవుతున్నాయి. ఈ అనుభవాలన్నీ ఈ షోలో షేర్ చేసుకోనున్నారు పవన్ కళ్యాణ్.