కేశవన్నా లెక్కలు కావాలి.. పవన్ ప్రశ్నకు పయ్యావుల షాకింగ్ ఆన్సర్…!
ఏపీ కేబినేట్ లో తొలిసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టినా ఏదోక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఏ న్యూస్ వచ్చినా మీడియా కూడా షేక్ అవుతూనే ఉంది. ఒక్కో న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
ఏపీ కేబినేట్ లో తొలిసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టినా ఏదోక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఏ న్యూస్ వచ్చినా మీడియా కూడా షేక్ అవుతూనే ఉంది. ఒక్కో న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏపీ కేబినేట్ లో జరిగిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. మంత్రులు వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. పాఠశాలలు పునప్రారంభం లోపు తల్లికి వందనం అమలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
పాఠశాలల పునప్రారంభంలోపు మెగా డీఎస్సీ అమలుచేయాలన్న సీఎం.. రైతులకు కేంద్రం నిధులు మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నులు, జలవనరులు, ఆర్ధిక ఇబ్బందులుపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ సమస్యల ఉదాహరణలుగా మంత్రులు చర్చించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. గోదావరి – బనకచర్ల అనుసంధానం పై మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం. కొత్త ప్రాజెక్టు కు ఎలా నిర్మించాలి, నిధుల సమీకరణపై చర్చ జరిగింది. కుప్పం, చిత్తూరుకు అదనంగా నీరు ఇచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, యోగి వేమన నుంచి హంద్రీనీవా లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధుల ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు సీఎం తెలిపారు.
ఇక ఇక్కడి నుంచి ఆసక్తికర చర్చ జరిగింది. పట్టిసీమ వల్ల రాయలసీమ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్దిపై ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులు పై ఫైనాన్స్ శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసి తీరుదామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకు మంత్రులు అందరూ అంగీకారం తెలిపారు. ఇక్కడ జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బకాయిలు ఎన్ని ఉన్నాయని పయ్యావుల కేశవ్ ను ఆరా తీసారు.
లక్ష 30వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పయ్యావుల కేశవ్ వివరించారు. అన్ని కోట్ల బకాయిలా అంటూ పవన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏయే శాఖల్లో ఎన్నెన్ని బకాయిలు ఉన్నాయో లెక్కలు ఇవ్వగలరా అని పవన్ అడగగా… వచ్చే సోమవారం లేదా మంగళవారానికి మీ పేషీకి వివరాలు పంపిస్తాను అని పయ్యావుల సమాధానం ఇచ్చారు. అలాగే 2014 నుంచి 2019 వరకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల లెక్కలను కూడా పవన్ స్వయంగా అడిగారు. ఆ లెక్కలను కూడా వీటితో జత చేసి పంపిస్తామని పవన్ కు పయ్యావుల సమాధానం ఇచ్చారు.