PAWAN KALYAN: పవన్ కల్యాణ్ జస్ట్ టెన్త్ పాస్.. నో ట్రోల్స్ ప్లీజ్ !!
ఆయన ఇంటర్మీడియట్ చదివినట్టు గతంలో చేసిన కామెంట్స్‌పై ప్రత్యర్థి పార్టీలు.. ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోతున్నాయి. ఒక్కో సభలో ఒక్కో గ్రూప్ చదివినట్టు పవన్ చెప్పడమే ఇందుక్కారణం. పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్ అఫిడవిట్‌లో తన విద్యార్హతలు ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు.

PAWAN KALYAN: జనసేనాని పవన్ కల్యాణ్ ఏం చదువుకున్నాడు..? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపైనే తెగ చర్చ నడుస్తోంది. ఆయన ఇంటర్మీడియట్ చదివినట్టు గతంలో చేసిన కామెంట్స్‌పై ప్రత్యర్థి పార్టీలు.. ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోతున్నాయి. ఒక్కో సభలో ఒక్కో గ్రూప్ చదివినట్టు పవన్ చెప్పడమే ఇందుక్కారణం. పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్ అఫిడవిట్‌లో తన విద్యార్హతలు ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు.
PAWAN KALYAN: పవన్ అప్పులు.. పవన్‌కు చిరంజీవి భార్య ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా
పవన్ ఏం చదివాడని ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ నడిచింది. గతంలో ఇంటర్‌కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఈ రచ్చకు దారితీశాయి. ఆ వీడియోలు నెట్టింట్లో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓ సభలో పవన్ కల్యాణ్.. తనకు టెన్త్‌లో వచ్చిన మార్కులకు సీటు రాకపోవడంతో.. నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమండేషన్‌తో CEC తీసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజుల గ్యాప్‌లోనే ఇంకో కామెంట్ చేశారు. తనకు అనుకున్నసీటు రాకపోవడంతో గత్యంతరం లేక MEC తీసుకున్నట్టు మరో మీటింగ్‌లో చెప్పాడు. ఇంకో సభలో అయితే.. తన ఫ్రెండ్స్‌తో కలసి MPC ట్యూషన్‌కి వెళ్ళినట్టు చెప్పడు. దాంతో అసలు పవన్ కల్యాణ్ ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్ తీసుకున్నాడు.. ఏం చదువుకున్నాడు.. అసలు ఇంటర్ పాస్ అయ్యాడా.. అని చాలామందికి డౌట్స్ వచ్చాయి.
అప్పట్లో బీకాంలో ఫిజిక్స్ చదివినట్టు ఓ లీడర్ చేసిన కామెంట్స్‌ని పవన్ కల్యాణ్‌కి అప్లయ్ చేస్తూ తెగ ట్రోల్ చేసింది అపోజిట్ పార్టీ సోషల్ మీడియా. ఇప్పుడు పిఠాపురంలో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా జనసేనాని తానేం చదివాడో క్లారిటీ ఇచ్చేశాడు. టెన్త్ పాసైనట్టు తెలిపాడు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 1984లో పది పూర్తి చేసినట్టు అఫిడవిట్‌లో తెలిపాడు. దాంతో పవన్ ఇంటర్మీడియట్‌కి సంబంధించిన డౌట్స్ అన్నీ తీరిపోయినట్టే. ఇక ఎవరూ ట్రోల్స్ చేయాల్సిన పన్లేదని జనసైనికులు చెబుతున్నారు.