Renu Desai: మీ మాజీకి చెప్పు.. అంబటి మళ్లీ మొదలెట్టాడు..
పవన్‌ను సపోర్ట్ చేస్తూ రేణుదేశాయ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. పవన్ డబ్బు మనిషి కాదని.. పవన్ చాలా అరుదైన వ్యక్తి అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. రాజకీయంగా ఆయనకే తన మద్దతు అని కూడా ప్రకటించింది.

Renu Desai: ఒక్క మాట ఇక్కడి నుంచి అటు వెళ్లిందో లేదో.. రెండు మాటలు అక్కడి నుంచి వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ, వైసీపీ మధ్య జరుగుతున్న యుద్ధం తీరు ఇది. పవన్, చిరు మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు, ఒకప్పుడు సంబంధం ఉన్న వాళ్లు ఎవరు ఏ మాట అన్నా.. వైసీపీ నేతలు వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
బ్రో మూవీ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. అంబటి వర్సెస్ జనసేన మధ్య యుద్ధం పీక్స్‌లో జరిగింది. పవన్ మీద సినిమాలు తీస్తానని అంబటి అంటే.. జగన్ మీద వెబ్‌సిరీస్ ప్లాన్ చేశాం అని జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ యుద్ధం ఇలా సాగుతుండగానే.. సీన్‌లోకి రేణుదేశాయ్ ఎంటర్ అయింది. పవన్‌ను సపోర్ట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. పవన్ డబ్బు మనిషి కాదని.. పవన్ చాలా అరుదైన వ్యక్తి అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. రాజకీయంగా ఆయనకే తన మద్దతు అని కూడా ప్రకటించింది. బ్రో సినిమా శాంబాబు వివాదం మీద కూడా మాట్లాడింది. ఆ వివాదం గురించి తనకు పెద్దగా అవగాహన లేదని.. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని కొంతమంది అన్నారని.. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారని.. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి అంటూ వీడియో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.
ఐతే రేణుదేశాయ్ వీడియోకు అంబటి రిప్లయ్ ఇచ్చారు. రేణు దేశాయ్ వీడియో పోస్ట్ చేసిన నిమిషాలకో ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అంటూ ట్వీట్ చేశాడు అంబటి. దీంతో చల్లారింది అనుకున్న రచ్చ.. మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రో మూవీ శాంబాబు రగడ.. ఇప్పట్లో ఆగే అవకాశాలు కనిపించడం లేదు.