PAWAN KALYAN: తెలంగాణలో పవన్ రాంగ్ స్టెప్.. బొక్కాబోర్లా పడడం ఖాయమా..
అసలు ఏం చూసుకొని.. ఏ బలం లెక్కలు వేసుకొని జనసేన బరిలోకి దిగుతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పోటీకి దిగుతున్నారు సరే.. గెలిచే సత్తా ఉందా.. గెలవకపోతే గెలవకపోయారు కనీసం పోటీ అయినా ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.
PAWAN KALYAN: అదేదో సినిమాలో అన్నట్లు.. ఇదో హఠాత్ పరిణామం. ఏపీలో రాజకీయాలు చేస్తున్న గ్లాస్ పార్టీ తెలంగాణ (TELANGANA)లో పోటీ చేయాలి అనుకోవడం ఏంటి.. ఏపీలో ఉందో లేదో అన్నట్లు బీజేపీతో పొత్తు ఉంటే.. ఇక్కడ మాత్రం మనం మనం బరంపురం అన్నట్లు కలిసి పోటీ చేయడం ఏంటి.. జనసేన (JANASENA)లో ముందు నుంచి పనిచేసిన వారిని పక్కనపెట్టి.. పేర్లు కూడా తెలియని వారికి టికెట్లు ఇవ్వడం ఏంటి.. ఇలా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయ్ జనసేన మీద !
PAWAN KALYAN: సన్నిహితుడికి షాక్ ఇచ్చిన పవన్.. టిక్కెట్ నిరాకరణ
అసలు ఏం చూసుకొని.. ఏ బలం లెక్కలు వేసుకొని జనసేన బరిలోకి దిగుతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పోటీకి దిగుతున్నారు సరే.. గెలిచే సత్తా ఉందా.. గెలవకపోతే గెలవకపోయారు కనీసం పోటీ అయినా ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. గెలిచినా, గట్టి పోటీ ఇచ్చినా పర్లేదు.. లేదంటే జనసేన పరువు గంగపాలు అయ్యే అవకాశం ఉంటుంది. 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది ముందు జనసేన. అంత నంబర్ అన్నారు కదా అని.. బీజేపీ (BJP) కూడా పెద్ద మనసు చేసుకొని 11 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధం అయిందని తెలుస్తోంది. అందులో మొదటి విడతలో భాగంగా 8మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన మూడు ఇస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. కూకట్‌పల్లి మినహా మిగిలిన ఏడు స్థానాల్లో జనసేనకు డిపాజిట్ వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. బీజేపీ ఇచ్చిన సీట్లలో గ్రేటర్ పరిధిలో కూకట్‌పల్లి మాత్రమే ఉంది. ఆ సీటు కూడా బీజేపీ నుంచి వచ్చిన నేతకు కేటాయించారు.
ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్ వస్తే..! ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితో..?
ఎవరికి కేటాయించారన్న సంగతి పక్కన పెడితే కూకట్‌పల్లిలో జనసేనది గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఖమ్మం వంటి చోట్ల తనదైన మార్క్ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితికి, ఆ పార్టీ నుంచి భారీ సహకారం వస్తుందని అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. ఇదంతా పక్కనపెడితే.. జనసేన ఇప్పుడు కచ్చితంగా కనీసం ఒక్క స్థానంలో అయినా గెలిచి తీరాలి. లేదంటే.. ఆ ప్రభావం ఏపీ ఎన్నికల మీద పడుతుంది. తెలంగాణలో గ్లాస్ పార్టీ తిరగబడితే.. అది మళ్లీ ఏపీలో వైసీపీకి ఆయుధంగా మారే చాన్స్ ఉంటుంది. దీనికంటే ప్రమాదకరమైన పరిణామం మరొకటి ఉంది. బీజేపీకి కాస్త అటు ఇటుగా సీట్లు వస్తే.. జనసేన మీద నెపం నెట్టేసే చాన్స్ ఉంటుంది. జనసేనతో పొత్తు వల్లే ఇలా జరిగింది అనే మాట వినిపించే చాన్స్ ఉంటుంది. అదే జరిగితే.. జనసేన పరిస్థితి ఉల్టా పుల్టా అయ్యే ప్రమాదం ఉంది. దీంతో తెలంగాణలో జనసేన పోటీకి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.