టీడీపీ ఎమ్మెల్యేకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కలుషిత నీటితో జనం ఇబ్బంది పడుతున్నారని, 44 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే రాము... పవన్ కళ్యాణ్ ను గత కంకిపాడు పర్యటన సందర్భంగా కోరారు.
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కలుషిత నీటితో జనం ఇబ్బంది పడుతున్నారని, 44 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే రాము… పవన్ కళ్యాణ్ ను గత కంకిపాడు పర్యటన సందర్భంగా కోరారు. వెంటనే పవన్ స్పందిస్తూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాటర్ బాటిల్స్ కూడా తెచ్చి చూపించారు.
పవన్ ఆదేశాలతో చర్యలకు దిగిన యంత్రాంగం రక్షిత తాగునీరు అందించేందుకు పనులు మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యానికి కూడా ప్రజలు గురవుతున్నారు. ఈ విషయాన్ని పవన్ కు చెప్పడంతో పవన్ ఆదేశాలతో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు పనులు మొదలుపెట్టారు. 40 ఫిల్టర్ బెడ్లను మార్చి, రక్షిత తాగునీరు అందించేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను పవన్ పర్యవేక్షించారు కూడా. వచ్చే జనవరి నాటికి 44 గ్రామాల ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి.