జగన్ ను సైలెంట్ గా కొడుతున్న పవన్… అధఃపాతాళానికి తోక్కడం పూర్తి అవ్వలేదా…?
ఏపీలో వైసీపీకి అధికారం కోల్పోయిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీకి బలం అనుకున్న నేతలు అందరూ బయటకు రావడం పార్టీని ఆందోళనకు గురి చేస్తున్న అంశంగా చెప్పాలి.
ఏపీలో వైసీపీకి అధికారం కోల్పోయిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీకి బలం అనుకున్న నేతలు అందరూ బయటకు రావడం పార్టీని ఆందోళనకు గురి చేస్తున్న అంశంగా చెప్పాలి. టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేకపోతే జనసేన లేదు అంటే బిజెపి లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీలు ఇద్దరు పార్టీకి పదవులకు రాజీనామా చేసిన విషయం మరువక ముందే భారీ ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటం జగన్ లో ఆందోళన పెరుగుతోంది.
ఎమ్మెల్సీలు కూడా పార్టీ కొందరు సిద్దమయ్యారు. జనసేన పార్టీలో చేరేందుకు వీరు అందరూ సిద్దమవుతున్నారు. వైసీపీ కోలుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇటీవల పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ గా ఉండగా ఇప్పుడు దాదాపు పది మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈ రెండు, మూడు రోజుల్లో భేటీ అయ్యే అవకాశం కనపడుతోంది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసారు.
ఆయన జనసేనలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇక ఒంగోలులో కూడా జనసేన నాయకులు ఆయనను స్వాగతిస్తున్నారు. రెండు రోజుల్లో ఆయన చేరే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టుగానే కనపడుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి కూడా పార్టీ మారుతున్నారు. ఆయన విజయవాడ వచ్చి పవన్ తో భేటీ అయ్యే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి.
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఎప్పటి నుంచో జనసేన కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రెండు నెలల నుంచి జనసేనలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నా కొన్ని కారణాలతో వాయిదా పడుతోంది. ఇక త్వరలోనే జనసేనలో జాయిన్ కావడానికి ఈ నేతలు అందరూ రూట్ క్లియర్ చేసుకున్నారు. మరి ఇంకెంత మంది పార్టీ మారతారో చూడాలి.