పవన్ యుద్ధం మొదలు, పవర్ ఫ్యాన్స్ కు సంక్రాంతి స్టార్ట్
ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. పరిపాలనతో డిప్యూటి సిఎంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనసేనాని ఇప్పుడు మళ్ళీ తన హోం గ్రౌండ్ లో ల్యాండ్ అవుతున్నారు.
ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. పరిపాలనతో డిప్యూటి సిఎంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనసేనాని ఇప్పుడు మళ్ళీ తన హోం గ్రౌండ్ లో ల్యాండ్ అవుతున్నారు. సినిమాలను గత కొన్నాళ్ళుగా పక్కన పెట్టిన పవన్ ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకోవడానికి సిద్దమై సెట్స్ లో అడుగు పెడుతున్నారు. పవన్ సినిమా కోసం అయిదేళ్ళ నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందరి హీరోల సినిమాలు వస్తున్నా పవన్ మాత్రం రాజకీయాలతో బిజీగా ఉన్నారు.
సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే చెప్పి మళ్ళీ మేకప్ వేసుకున్న పవన్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు. ఈ సినిమా మొదలుపెట్టి అయిదేళ్ళు అయింది. ఇద్దరు దర్శకులు మారారు. అయినా సరే సినిమా మాత్రం ఇంకా షూట్ పెండింగ్ ఉంది. వచ్చే ఏడాది మార్చ్ చివరికి సినిమాను ఎలా అయినా విడుదల చేయాలని మేకర్స్ చాలా పట్టుదలగా ఉన్నారు. పవన్ మొన్నా మధ్య సెట్స్ కు వెళ్లి మళ్ళీ బిజీ అయిపోయారు. ఓజీ సినిమా షూట్ కూడా స్టార్ట్ చేసారు.
జనవరి ఫస్ట్ కు ఈ రెండు సినిమాల నుంచి మంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఓజీని భారీ బడ్జెట్ తో నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. పవన్ ఎలా అయినా డిసెంబర్ లో షూట్ విషయంలో బ్రేక్ ఇవ్వొద్దు అని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ అయితే ఇబ్బంది అని ఎపీలోనే షూట్ ను ప్లాన్ చేసారు. ఇక నేటి నుంచి హరిహర వీరమల్లు షూట్ లో పవన్ పాల్గొంటున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. అందుకే ఈ సినిమా లేట్ అయినా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.
పవన్ ఇప్పుడు యాక్షన్ సీన్స్ లో పాల్గొంటారు అని పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఓ రెండు సాంగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ముందు డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను మొదలుపెట్టగా… ఆ తర్వాత ఆయన తప్పుకోగా జ్యోతి కృష్ణ సినిమా షూట్ ను ముందుకు తీసుకు వెళ్ళారు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓజీ నుంచి కూడా క్రిస్మస్ కు కిక్ ఇచ్చే అప్డేట్ ప్లాన్ చేసారు. చూద్దాం ఇప్పటి నుంచి అయినా సినిమా షూట్ కంటిన్యూ అవుతుందా బ్రేక్ ఇస్తారా అని.