కూతుళ్ళకు పవన్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు, న్యూ ఇయర్ గిఫ్ట్.. ఎన్ని కొట్లంటే?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కూతుళ్లు అంటే ఎంత ప్రేమ అనేది మనం చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తాను ఎక్కడికి వెళ్లినా సరే కూతుర్లను వెంట తీసుకుని వెళ్లారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కూతుళ్లు అంటే ఎంత ప్రేమ అనేది మనం చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తాను ఎక్కడికి వెళ్లినా సరే కూతుర్లను వెంట తీసుకుని వెళ్లారు. తిరుపతిలో చిన్న కూతురుతో డిక్లరేషన్ కూడా ఇప్పించి సెన్సేషన్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇది నేషనల్ లెవెల్ లో కూడా హైలెట్ అయింది. అప్పట్లో జగన్ కు కౌంటర్ గా తన కూతురితో సంతకం పెట్టించారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు పరిపాలన విషయంలో బిజీగా ఉండటంతో ఎక్కువగా అమరావతి లోనే ఉంటున్నారు.
కుదిరిన సమయంలో ఆయన అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. ఇక త్వరలోనే అమరావతిలో ఒక ఇల్లు కట్టుకొని ఫ్యామిలీని ఏపీ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్. దీని కోసం ఇప్పటికే ఒక స్థలం కూడా ఫైనల్ అయిపోయింది. త్వరలోనే ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేయాలని, పిల్లలకు కూడా చదువులు అక్కడే ఏర్పాటు చేయించే ప్లాన్ చేశారు పవన్. ఇక తన పిల్లల భద్రత విషయంలో కూడా పవన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన పిల్లలకు రెండు ఖరీదైన కార్లు గిఫ్ట్ గా ఇచ్చారు పవన్.
ఆ రెండు నార్మల్ కార్లు కాదు. బులెట్ ప్రూఫ్ కార్లు. ఎక్కడికైనా వెళ్లే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. నిసాన్ కంపెనీకి చెందిన రెండు కార్లను తన కూతుర్లు, కొడుకుల కోసం బుక్ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉండటంతో పిల్లల భద్రత విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటున్నారు. ఫ్యామిలీ అమరావతి షిఫ్ట్ అయ్యే వరకు పిల్లల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిల్లల గురించి ఏ విషయాలు మీడియాలో హైలెట్ కావద్దని పవన్ అలెర్ట్ గా ఉంటున్నారు.
ఇదే విషయాన్ని తన ఇంటి వద్ద సెక్యూరిటీ చూసుకునే వాళ్లకు కూడా క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఆయన సతీమణి కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా బయట కనబడటం లేదు. నిస్సాన్ కంపెనీకి చెందిన రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్ల కోసం దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన భద్రతతో పాటు తన బిడ్డల భద్రత కూడా ముఖ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వమే తన పిల్లలకు భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చినా సరే ఆ విజ్ఞప్తిని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు.
తన పిల్లల భద్రత ఇప్పుడు మాత్రమే కాదని భవిష్యత్తులో కూడా తాను చూసుకోవాల్సిన అవసరం ఉందని అందుకే తాను కార్లు కొనాలనుకుంటున్నాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించారట పవన్ కళ్యాణ్. ఇక పవన్ కుమారుడు అఖీరా పదేపదే బయటకు వెళుతూ ఉంటాడు. ఈ సందర్భంగా కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడాలని డ్రైవర్లకు కూడా స్పష్టంగా చెప్పారట పవన్. అవసరమైతే మరో కారు కొందామని అంతేగాని సేఫ్టీ లేని కార్లలో ప్రయాణం చేయవద్దని అఖీరాకు క్లారిటీగా చెప్పేసారు.
ఇక ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నావనే సమాచారాలను తన కార్యాలయానికి పంపాలని… కుటుంబ సభ్యులకు పవన్ చెప్పారు. అలాగే తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పిల్లల భద్రత విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కోరినట్లు మెగా కుటుంబ వర్గాలు ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమంలో కూడా వాతావరణం అంతగా బాగాలేదు. అందుకే పవన్ కూడా కాస్త అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గా వ్యవహరించారు.
ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థితి హాట్ హాట్ గా మారింది. అటు రేషన్ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున ఉండటంతో పవన్ కళ్యాణ్ కూడా తన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి హడావుడి చేయడంతో భద్రత విషయంలో పవన్ అలెర్ట్ అయ్యారు. ఆ వ్యవహారం విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. స్వయంగా హోం మంత్రి అలాగే ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకున్నారు.
డీజీపీ కూడా స్థానిక పోలీసులపై సీరియస్ అయ్యారు వై క్యాటగిరి భద్రత ఉన్న సమయంలో ఒక నకిలీ ఐపీఎస్ పోలీసులకు చొరబడితే ఏ విధంగా గుర్తించలేకపోయారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిల్లల కోసం ఖర్చు కోసం వెనకాడకుండా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనేశారు. డిసెంబర్ లో బుక్ చేయగా.. అవి 31 సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నాయి.