వర్మ పని ఖతం… పిఠాపురంలో పవన్ మార్క్ పాలిటిక్స్..!
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. ప్రధానంగా వినపడిన పేరు వర్మ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు.

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. ప్రధానంగా వినపడిన పేరు వర్మ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు. టిడిపి అధిష్టానం చెప్పడంతో.. వర్మ పిఠాపురం నుంచి పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ విజయం కోసం 2024 ఎన్నికల్లో సహకరించారు. పవన్ కళ్యాణ్ పెద్దగా నియోజకవర్గంలో ఫోకస్ చేయకపోయినా.. వర్మ అన్ని విధాలుగా అక్కడ సహకరించారు.
పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ రావడంలో కూడా వర్మ కీలకపాత్ర పోషించారు. అయితే ఎన్నికల తర్వాత వర్మకు తగిన ప్రాధాన్యత దక్కలేదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్.. ఈ విషయంలో అసహనంగా ఉంది. నియోజకవర్గంలో ఉన్న టిడిపి క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ విజయం కోసం కష్టపడినా సరే.. ఆయనకు విలువ లేకుండా పోయింది అనే అభిప్రాయాలు వినిపించాయి.
ఇక టిడిపి అధిష్టానం మాటతో వర్మ సైలెంట్ గా పవన్ కళ్యాణ్ విజయం కోసం అన్ని విధాలుగా కష్టపడ్డారు. అయితే ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కడం లేదు. ఇటీవల 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన సందర్భంగా.. వర్మకు కచ్చితంగా సీటు ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన పేరును పక్కన పెట్టారు. ఇక జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది కూటమి. దీనితో వర్మ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలకు కమ్ముకున్నాయి.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గం బాధ్యతలను పూర్తిగా నాగబాబుకు అప్పగించాలని.. అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా సరే నాగబాబు కీలకంగా వ్యవహరించే విధంగా.. పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. తాజాగా కొన్ని అధికారిక కార్యక్రమాలు కూడా ఎమ్మెల్సీ నాగబాబు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నాగబాబు కనుసన్నల్లో జరిగే విధంగా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నారు.
దీనితో వర్మకు నియోజకవర్గంలో.. పూర్తిగా ప్రాధాన్యత తగ్గించే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం చేసుకోవాలని.. పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. దీనితో వర్మ నుంచి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. నాగబాబును రంగంలోకి దించి.. ఇకనుంచి ప్రతి కార్యక్రమాన్ని ఆయన కనుసనల్లోనే నిర్వహించే విధంగా.. పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పట్లో కూటమిలో చీలిక వచ్చే అవకాశం లేదు. కాబట్టి వర్మ పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవనే చెప్పాలి. మరి ఆయన పార్టీ మారతారా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారో అనేది చూడాలి.