నాగబాబుకు పవన్ స్మాల్ వార్నింగ్.. జాగ్రత్త అన్న…!
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. కూటమికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కనపడటం లేదు. అయితే కొంతమంది జనసేన పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. కూటమికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కనపడటం లేదు. అయితే కొంతమంది జనసేన పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు.. మాత్రం ఈ మధ్య కాలంలో సంచలనవుతున్నాయి. ఇటీవల కోనసీమ జిల్లాలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు.. అలాగే పిఠాపురం లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనం అయ్యాయి. రాజకీయంగా కూటమి ప్రస్తుతం సౌకర్యవంతంగానే ఉంది.
కానీ ఇలాంటి సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సంచలనం రేగింది. గతంలో కూడా నాగబాబు ఇదే విధంగా దూకుడుగా వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం.. పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉంది. వైసీపీని కట్టడి చేయాలి అంటే కొన్నాళ్లపాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కనీసం 15 ఏళ్ల పాటు ఈ రెండు పార్టీలు కలిసి ఉంటేనే ఏపీలో వైసీపీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా కూటమి రాజకీయం చేయాలి. ఈ తరుణంలో నాగబాబు లాంటి వ్యక్తులు ఏ విధమైన దూకుడు వ్యాఖ్యలు చేసిన సరే.. అనవసరంగా వాతావరణం దెబ్బ తినే అవకాశం ఉంది. ఇప్పటికే నాగబాబు వ్యాఖ్యలపై టిడిపి తో పాటుగా బిజెపి నేతలు కూడా అగ్రహంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ విజయం కోసం టిడిపి… బిజెపి కూడా పిఠాపురం నియోజకవర్గంలో కష్టపడ్డాయి. అయినా సరే వాళ్ళిద్దరికీ విలువ ఇవ్వకుండా నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో చిచ్చు రేపుతున్నాయి.
దీనితో పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. పిఠాపురం బహిరంగ సభ అయిన వెంటనే పవన్ కళ్యాణ్.. నాగబాబుతో భేటి అయ్యారట. నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని చెప్పిన.. పవన్ కళ్యాణ్, ఇకనుంచి ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని.. సహజ స్వభావాన్ని పక్కనపెట్టి.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడాల్సిన అవసరం ఉందని నాగబాబుకు పవన్ కళ్యాణ్ సూచించారట.
క్యాబినెట్ లో చోటు దక్కాలంటే కాస్త కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉందని.. నాగబాబుకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి తో పొత్తు నుంచి జనసేన బయటకు వస్తే జనసేన పార్టీకి ఎక్కువ నష్టం ఉండే అవకాశం ఉంటుంది. టిడిపికి కావాల్సిన స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కాబట్టి జనసేన పార్టీ ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని జనసేన పార్టీ నేతలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.
అటు జనసేన పార్టీ సోషల్ మీడియా కూడా నాగబాబు వ్యాఖ్యలపై కాస్త అసహనం వ్యక్తం చేసింది. సందర్భానికి అనుకూలంగా నాగబాబు మాట్లాడలేదు అనే అభిప్రాయాలు.. జనసేన కేడర్ నుంచి వినిపించాయి. భవిష్యత్తులో ఆయన జాగ్రత్తగా మాట్లాడకపోతే అనవసరంగా పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టీ కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని.. సొంత బలాన్ని ఎక్కువగా ఊహించుకోవడం.. నాగబాబుకు కరెక్ట్ కాదు అంటూ హెచ్చరిస్తున్నారు పార్టీ కార్యకర్తలు.