పవన్ నన్నేం పీకలేడు, రెచ్చిపోయిన పెద్దిరెడ్డి

తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటన లో తప్పుడు వార్తలు రాశారని వారి పై 50 కోట్లకి పరువు నష్టం దావా వేశామన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2025 | 06:36 PMLast Updated on: Jan 29, 2025 | 6:36 PM

Peddireddy Sensational Comments On Pawan Kalyan

తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటన లో తప్పుడు వార్తలు రాశారని వారి పై 50 కోట్లకి పరువు నష్టం దావా వేశామన్నారు. ఈ రోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారని 2001 లో మేము ఆ ప్రాంతం లో భూములు కొనుగోలు చేశామన్నారు. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసన్నారు. 19.11.1981 లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిని వారికి ఆర్డర్ ఇచ్చారన్నారు.

అధునాతన గెస్ట్ హౌస్ కట్టారని వార్తలు రాశారు అంటూ మండిపడ్డారు. 2001 లోనే అక్కడ పని చేసే వారికోసం మేము గెస్ట్ హౌస్ కట్టామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఆరోజు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదు అని తేల్చి చెప్పిందన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారన్నారు. కోర్టు లో పిటిషన్ వేసిన కూడా కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చిందని తెలిపారు.

1968 లో ఇచిన ఫారెస్ట్ గెజిట్ లో కూడా ఆ 76 ఎకరాలు వారికి సంబంధం లేదు అని తేల్చారన్నారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారని 27.06.2022 లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయన్నారు. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందాన అంటారని మండిపడ్డారు. గతంలో ఇసుక ద్వారా 40 వేల కోట్లు మింగేసాను అని, ఆ తర్వాత నేపాల్ లో నాకు సంబంధించిన ఎర్ర చందనం దొరికింది అని ఆరోపించారని మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంతి అయ్యి ఇన్ని రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసారు.