కొంచెం తగ్గు పుష్ప, చావు బతుకుల్లో ఉన్నాడు చూసి రా…!
టాలీవుడ్‌లో ఎవరిని టచ్ చేసినా ఒకే మాట చెప్తున్నారు. బీ స్ట్రాంగ్ బన్నీ అన్నా. ఒకే.. అసలు బన్నీ అన్నకు ఏమయ్యింది. జస్ట్ ఒక రాత్రి జైలులో ఉన్నాడు అంతే. ఈ మాత్రానికి బన్నీకి వచ్చిన పరామర్శలు అన్నీ ఇన్నీ కావు. అండర్ ట్రయల్ ఖైదీగా జైళ్లలో కొన్ని వేల మంది ఉంటున్నారు.
టాలీవుడ్‌లో ఎవరిని టచ్ చేసినా ఒకే మాట చెప్తున్నారు. బీ స్ట్రాంగ్ బన్నీ అన్నా. ఒకే.. అసలు బన్నీ అన్నకు ఏమయ్యింది. జస్ట్ ఒక రాత్రి జైలులో ఉన్నాడు అంతే. ఈ మాత్రానికి బన్నీకి వచ్చిన పరామర్శలు అన్నీ ఇన్నీ కావు. అండర్ ట్రయల్ ఖైదీగా జైళ్లలో కొన్ని వేల మంది ఉంటున్నారు. కానీ బన్నీ ఉన్నది కేవలం ఒక్క రాత్రి మాత్రమే. ఎందుకంటే ఫాస్ట్‌గా బెయిల్ తెచ్చుకునేందుకు బన్నీకి దగ్గర డబ్బులున్నాయి. మిగిలినవాళ్ల దగ్గర డబ్బులు లేవు. సరే డబ్బు విషయం పక్కన పెట్టినా.. ఒక్క రాత్రి జైలులో ఉన్నందుకు ఇంత మంది వెళ్లి పలకరించి వస్తున్నారు. మరి తల్లిని పోగొట్టుకుని ప్రాణం కోసం పోరాడుతున్న ఆ బిడ్డ.. శ్రీతేజ్ పరిస్థితి ఏంటి. కనీసం ఒక్కడైనా కన్నెత్తి కూడా ఆ బిడ్డ గురించి అడగలేదు. తల్లిని పోగొట్టుకుని ప్రాణం కోసం పోరాడుతున్న శ్రీతేజ్ అల్లు అర్జున్‌కు చాలా పెద్ద ఫ్యాన్. అసలు ఆరోజు ఆ కుటుంబం ప్రీమియర్ షోకు రావడానికి శ్రేతేజ్ కారణం.
సినిమా ఫస్ట్ ప్రింట్ చూడ్డానికి, బన్నీని డైరెక్ట్‌గా చూడ్డానికి శ్రీతేజ్‌ను థియేటర్‌కు తీసుకువచ్చాడు అతని తండ్రి. కానీ అదే బన్నీ వల్ల ఆరోజు తల్లిని దూరం చేసుకున్నాడు శ్రీతేజ్. ఇప్పటి వరకూ ఆ బిడ్డను పట్టించుకున్నవాడు లేడు. హాస్పిటల్‌కు వెళ్లినవాడు లేడు. పరిస్థితి ఏంటి అని అడిగనవాడు లేడు. మీరిచ్చే డబ్బు వాళ్ల అవసరాన్ని తీర్చుతుంది కావొచ్చు కానీ మీరు హాస్పిటల్‌కు వెళ్లి చెప్పే ధైర్యం ఆ బిడ్డకు తిరిగి ప్రాణం పోస్తుంది. జరిగిన వ్యవహారంలో బన్నీ నేరుగా కారణం కాకపోవచ్చు. ప్రాణం పోవాలని ఎవరూ కోరుకోరు. ఒప్పుకుంటాం. అది అనుకోకుండా జరిగిన సంఘటనే. ఒప్పుకుంటాం. బన్నీని నేరుగా కారకున్ని చేసి అరెస్ట్ చేయడం తప్పా ఒప్పా అనే విషయం పక్కన పెడితే.. అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకూ బన్నీ మీద ఎవరూ నెగటివ్‌గా కామెంట్ చేయలేదు. కానీ.. బన్నీ ఇంటికి వెళ్లిన తరువాత.. బన్నీ దగ్గరకు వెళ్లి పరామర్శిస్తున్న యాక్టర్స్. డైరెక్టర్స్ వ్యవహారం ఒక యాంగిల్‌లో బన్నీని బ్యాడ్ చేస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ బిడ్డది పెళ్లి కానీ ఈ బిడ్డది చావు. ఏది పెద్ద కష్టం అని. ఆ డైలాగ్ రాసిన త్రివిక్రం కూడా బన్నీని చూసేందుకు స్వయంగా కారు నడుపుకుంటూ మరీ వచ్చాడు. కానీ అదే త్రివిక్రం ఆలోచించుకోవాలి. బన్నీ జస్ట్ ఒక్క రాత్రి జైల్‌లో ఉన్నాడు. కానీ శ్రీతేజ్ చావుతో పోరాడుతున్నాడు. ఎవరిది పెద్ద కష్టం. మీ అండ ఎవరికి అవసరం. మీ సాయం ఎవరి ప్రాణాన్ని నిలబెడుతుంది. మీ ఓదార్పు ఎవరికి ధైర్యాన్ని చెప్తుంది.
శ్రీతేజ్ లాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే హీరోలు స్టార్లు అవుతున్నారు. కానీ స్టార్లకు మాత్రం.. ఫ్యాన్స్ అంటే జస్ట్ ప్రజలు అవుతున్నారు. అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చాక బన్నీని చూసేందుకు టాలీవుడ్ మొత్తం కదిలింది. కానీ చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్‌ను కలవడానికి కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వెళ్లలేదు. అల్లు అర్జున్ కేసు కోర్టులో ఉంది. అక్కడి వెళ్లడానికి అతనికి లీగల్ ఇష్యూ అడ్డు రావొచ్చు. కానీ మిగతా వాళ్లకు ఏమయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ అ్వవగానే కేసు పెట్టిన అతని ఇంటికి వెళ్లి కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పేలా చేశారు. కానీ నీ కొడుకు ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక్కడైనా అడిగాడా. ఇదేనా మీ ఆర్మీ. బన్నీ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించినవాళ్లలో కనీసం ఒక్క స్టారైనా హాస్పిటల్‌కు వెళ్లి శ్రీతేజ్‌ను చూస్తే.. పరిస్థితి వేరుగా ఉండేది. మా సినిమాల కోసం ఫ్యాన్స్ ఉన్నట్టే ఫ్యాన్స్‌కు కష్టమొస్తే మేము కూడా వస్తాం అనే భరోసా ఇవ్వడంలో తెలుగు హీరోలు ఫెయిల్ అయ్యారు. మీ సినిమాలు చూడ్డానికి మీకు కటౌట్‌లు కట్టడానికి కలెక్షన్లు తెచ్చిపెట్టడానికి ఫ్యాన్స్ కావాలి కానీ.. వాళ్లకు కష్టమొస్తే మాత్రం ఎవరికీ ఏ పట్టింపు లేదు. హీరోలంతా ఒకటి గుర్తుంచుకోవాలి.. అభిమానులు ఉన్నంతవరకే మీరు హీరోలు. అదే ఫ్యాన్స్ మిమ్మల్ని లైట్ తీసుకుంటే.. మీ జీవితాలు ఎలా ఉంటాయో మా కంటే మీకే ఎక్కువ తెలుసు. ఎక్కడా తగ్గని ఏ హీరో అయినా సరే.. ఫ్యాన్స్ విషయంలో కొంచెం తగ్గితే నే బెటర్.