Top story: అప్పుడు బూతులు…ఇప్పుడు నీతులు ఇంట్లో ఆడవాళ్ల గురించి ఇప్పుడే గుర్తొచ్చిందా ?
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆలియస్ పేర్ని వెంకట్రామయ్యకు...అరెస్టు భయం పట్టుకుందా ? అందుకే ఇంట్లో ఆడవారి గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారా ? 7వేల టన్నుల బియ్యం బొక్కేస్తే...కేసులు పెట్టరా ?
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆలియస్ పేర్ని వెంకట్రామయ్యకు…అరెస్టు భయం పట్టుకుందా ? అందుకే ఇంట్లో ఆడవారి గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారా ? 7వేల టన్నుల బియ్యం బొక్కేస్తే…కేసులు పెట్టరా ? ఇప్పుడు సెంటిమెంట్ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలు ఏంటి ? వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాల్లో మహిళలు గుర్తుకు రాలేదా ? తన దాకా వచ్చే సరికి…ఆడవాళ్లు గుర్తుకు వచ్చారా ?
ఐదేళ్ల పాటు ఇష్టానుసారంగా రెచ్చిపోయాడు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేశాడు. ఒరేయ్ పవన్ కల్యాణ్ గా, మనం మనం కులపోల్లేరా అన్నాడు. మూడు పెళ్లిళ్లు…మూడు పెళ్లిళ్లు అంటూ…ఎన్ని మాటలు అన్నాడు…ఎన్ని సార్లు ప్రెస్ మీట్లు పెట్టాడో లెక్కేలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేశ్ లను అయితే…అడ్డు అదుపు లేకుండా బూతులు మాట్లాడాడు. ఆఖరికి వారి కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టలేదు. సందర్భం దొరికితే చాలు…చంద్రబాబు నాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై బూతులు అందుకున్నాడు. ఏ ప్రజాప్రతినిధులు ఉపయోగించని భాషతో కించపరిచేలా వ్యవహరించారు. పేర్ని నానిది నాలుకేనా…ఇంకా ఏదైనా అన్న స్థాయిలో పట్టపగ్గల్లేకుండా ప్రవర్తించాడు.
వైసీపీ ప్రభుత్వం పోయింది…కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్టార్టింగ్ కొన్ని రోజులు…పాత పేర్ని నాని కనిపించాడు. ఎప్పుడైతే పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం అయ్యాయి. సివిల్ సప్లయిస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట 3500…ఆ తర్వాత 4వేల 5వందలు…బియ్యం మాయమైనట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దీనిపై అనేక విమర్శలు రావడంతో…గోడౌన్ లో ఉన్న బియ్యాన్ని మొత్తం మరో ప్రాంతానికి తరలిస్తే అసలు కథ బయటపడింది. మొత్తం 7వేల 5వందల బస్తాల బియ్యం గాయబ్ అయినట్లు అధికారులు నిర్దారించారు. అధికారుల నోటీసులతో ఇప్పటికే కోటిన్నర ప్రభుత్వానికి జమ చేశాడు. జయసుధ పేరుతో గోడౌన్ ఉండటంతో…నానితో పాటు ఆమెను అరెస్టు చేస్తారన్న భయం మాజీ మంత్రి పేర్ని నానికి వణుకు మొదలైంది. అదే సమయంలో భయంతో కూడిన వినయం వచ్చేసింది.
ఇటీవల నాని చేసిన వ్యాఖ్యలు చూసిన వారంతా…అబ్బా ఇంత మార్పేంటి ? భార్య జయసుధ అరెస్టు విషయంలో చంద్రబాబు వ్యవహారశైలిని ఆయన మెచ్చుకున్నారు. ఈ కేసులో తన భార్య జయసుధ అరెస్టు కోసం ఓ మంత్రి ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు మాత్రం నో అన్నారని, తద్వారా హుందాగా వ్యవహరించారని పేర్ని ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు ఒక్కరే ఆడవాళ్లను అరెస్టు చేయొద్దని చెప్పినట్లు నాకు సమాచారం ఉంది. నాకు, చంద్రబాబుకు రాజకీయ వైరం ఉన్నా.. ఈ విషయంలో చంద్రబాబు హూందాగా వ్యవహరించారంటూ…తనలోని కొత్త నానిని నిద్రలేపాడు. రాజకీయ కక్ష ఉంటే నన్ను, నా కొడుకును అరెస్టు చేయండి అంటూ నాని చెప్పుకొచ్చారు. దీంతో మనోడిలో ఏమైన అపరిచితుడు పూనాడా అనే వారు లేకపోలేదు. రేషన్ బియ్యం కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబును ప్రశంసించారని కొందర అంటుంటే…కాదు చంద్రబాబు హుందాతనం ఎలా ఉంటుందో పేర్నినాని స్వయంగా తెలుసుకున్నారని అంటున్నారు.
మరోవైపు పేర్ని నాని వ్యవహారశైలిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. రేషన్ బియ్యం మాయమైంది నిజమని, డబ్బులు కట్టింది వాస్తవమేనన్నారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరని ప్రశ్నించిన పవన్…చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను వాళ్లు తిట్టలేదా అని నిలదీశారు. తాము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదని స్పష్టం చేశారు. పేర్ని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయంటూ ఎద్దేవా చేశారు. అప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా అని మండిపడ్డారు.
అధికారంలో ఉంటే ఒకలా…లేకపోతే ఒకలా…పేర్ని నాని వ్యవహరిస్తుండటంతో…జనంలోనూ కొత్త చర్చ జరుగుతోంది. నాలుగేన్నరేళ్ల పాటు ప్రభుత్వంతో ఇబ్బంది పడేదాని కంటే…సైలెంట్ గా ఉండటమో లేదంటే…అధికార పార్టీని తిట్టకుండా…ఇంకా చెప్పాలంటే ప్రసంశలు కురిపిస్తే మనం బయట పడిపోవచ్చని వైసీపీ నేతలు స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను అనరాని మాటలు అన్న వారు…కించ పరిచేలా వ్యవహరించిన వారంతా…ఇప్పటికే సైలెంట్ అయిపోయారు. తాజాగా పేర్ని నాని కూడా చంద్రబాబు హుందాతనం పొగడ్తలు కురిపించడంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా వైసీపీ నేతలకు తత్వం బోధపడిందని…అధికారం శాశ్వతం కాదని గుర్తు చేస్తున్నారు.