KCR TAPPING : ఫోన్ ట్యాపింగ్ పెద్ద ప్లాన్.. కవితను తప్పించాలని పెద్దాయన గేమ్

అచ్చు రాజరికం పోకడలు... దొరల పెత్తనం సాగాలి... నాకు ఎవరూ ఎదురు మాట్లాడొద్దు. నేను చెప్పిందే వినాలి... ఎవరైనా ఎదురు మాట్లాడారో... వాటి మీద నిఘా పెట్టాలి...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 28, 2024 | 02:13 PMLast Updated on: May 28, 2024 | 2:13 PM

Phone Tapping Is A Big Plan A Big Game To Avoid Kavita

 

 

 

అచ్చు రాజరికం పోకడలు… దొరల పెత్తనం సాగాలి… నాకు ఎవరూ ఎదురు మాట్లాడొద్దు. నేను చెప్పిందే వినాలి… ఎవరైనా ఎదురు మాట్లాడారో… వాటి మీద నిఘా పెట్టాలి… ఇలాగే సాగింది గత బీఆర్ఎస్ పాలనలో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళో వీళ్ళో కాదు… ఏకంగా పెద్దాయన, మాజీ సీఎం కేసీఆర్ పేరే బయటకు వచ్చింది. ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ లీడర్లు, మీడియా సంస్థల అధిపతులు, జర్నలిస్టులు, అధికారులు… ఇలా ఎవర్నీ వదల్లేదు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు… వాళ్ళ మీద వెంటనే నిఘా మొదలయ్యేదని SIB, టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన మాజీ పోలీస్ అధికారులు అంటున్నారు. ఏప్రిల్ 9న రాధా కిషన్ రావు… తన స్టేట్ మెంట్ లో డైరెక్ట్ గా కేసీఆర్ పేరునే ప్రస్తావించాడు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతో మొదలైన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ దందా… గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల దాకా కంటిన్యూ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను తప్పించడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును వాడుకోడానికి కేసీఆర్ మాగ్జిమమ్ ట్రై చేసినట్టు తేలింది. అందుకే ఈ కేసులో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది ఫెయిల్ అవడంతో పోలీస్ అధికారులపై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు పైలెట్ రోహిత్ రెడ్డి ఒక్కడికే BJP నుంచి ఆఫర్ వస్తే… మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేసి కథను రక్తికట్టించాలని అనుకున్నారు. కేరళలో ఉంటున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసులు అక్కడికి వెళ్ళగా… అతను తప్పించుకోవడంతో… మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నీరుగారిపోయింది. బీఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసి… కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు తెచ్చుకోవాలన్న ప్లాన్ బెడిసికొట్టింది.

ఇక ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు… వీళ్ళు అని లేదు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్, పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం, శంబీపూర్ రాజు… మన, పర బేధం లేకుండా అందరి ఫ్లోన్లనూ ట్యాప్ చేయించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ని కూడా వదిలిపెట్టలేదు కేసీఆర్. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వీటన్నింటిపైనా స్టేట్మెంట్ ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు హస్తం కూడా బయటపడింది. ఐ న్యూస్ హెడ్ శ్రవణ్ కుమార్ ను రంగంలోకి దించి… మీడియా, జర్నలిస్టులు టార్గెట్ గా ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ను మళ్లోసారి అధికారంలోకి తీసుకురావడానికి మాగ్జిమమ్ ప్రయత్నించింది SIB పోలీస్ టీమ్. అందుకే ఈ టీమ్ లో మొత్తం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే నియమించుకున్నారు. ఇంత తతంగం నడిపి మాజీ సీఎం కేసీఆర్… తనకేమీ తెలియనట్టుగా మొన్నటి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బుకాయించారు. ఎవరో పోలీసోళ్ళు… నిఘా పెడితే నాకేం సంబంధం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వానికి గూఢచారులు ఉంటారు.. వాళ్ళు నివేదికలు ఇవ్వడం సహజం … రిపోర్టులు ఏం చేసి తీసుకొచ్చారో మాకెలా తెలుస్తుంది అంటూ … తనకేమీ తెలియదన్నట్టు చెప్పుకొచ్చారు కేసీఆర్. ఏమీ తెలియకుండానే… SIB టీమ్ లో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుకి అన్ని కీలక బాధ్యతలు అప్పగించారా ? ఆ టీమ్ లో తన సామాజిక వర్గం అధికారులను ఎందుకు నియమించుకున్నట్టు… లాంటి ప్రశ్నలను నెటిజెన్లు సంధిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పెద్దాయనతో పాటు మాజీ మంత్రి హరీష్ ఇంకా మాజీ మంత్రులు … ఇలా చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ వీళ్ళపై చర్యలు తీసుకుంటుందా… లేదా కొన్నాళ్ళు మీడియాలో సందడి చేశాక… కేసు మూసేస్తుందా అన్నది చూడాలి.