PITHAPURAM VARMA: పవన్‌కి బిగ్ రిలీఫ్ ! కూల్ అయిన వర్మ.. బాబు హామీ ఏంటంటే

మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాగానే కూల్ చేశారు. పిఠాపురంలో బాబు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా నిలబడతాననీ.. నాన్ లోకల్స్ స్థానం లేదంటూ ప్రతిజ్ఞ చేసిన వర్మతో చంద్రబాబే డైరెక్ట్‌గా డీల్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2024 | 04:43 PMLast Updated on: Mar 18, 2024 | 4:43 PM

Pithapuram Issue Solved By Tdp Chief Chandrababu Naidu

PITHAPURAM VARMA: పిఠాపురంలో నేనే పోటీ చేస్తా.. నాన్ లోకల్స్‌కి ప్రవేశం లేదంటూ ఫ్లెక్సీలతో అదరగొట్టాడు మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించగానే.. వర్మ అనుచరులు టీడీపీ జెండాలు తగలబెట్టారు. పార్టీ ఆఫీసు ముందు బ్యానర్లు చించేశారు. బాబును.. పవన్‌ను తిట్టిపోశారు. నానా హంగామా చేశారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం సంగతి. ఇప్పుడు వర్మ పూర్తిగా మారిపోయారు. పవన్ కల్యాణ్ ఇంకా పిఠాపురంలో అడుగు పెట్టకముందే.. ఆయన్ని గెలిపించాలంటూ వర్మ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.

BANDARU SATYANARAYANA: టీడీపీకి షాక్.. వైసీపీలోకి టీడీపీ కీలక నేత

మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాగానే కూల్ చేశారు. పిఠాపురంలో బాబు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా నిలబడతాననీ.. నాన్ లోకల్స్ స్థానం లేదంటూ ప్రతిజ్ఞ చేసిన వర్మతో చంద్రబాబే డైరెక్ట్‌గా డీల్ చేశారు. బాబుతో మాట్లాడాక వర్మ సైలెంట్ అయ్యారు. 2014లో వర్మకు టీడీపీ టిక్కెట్ దక్కలేదు. అయినా ఇండిపెండెంట్ గా పోటీచేసి 47 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వర్మ. ఈసారి కూడా అలాగే చేస్తాడేమో.. పవన్ మరోసారి ఓడిపోతారా అన్నభయం జనసైనికుల్లో, అభిమానుల్లో కనిపించింది. కానీ అక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో.. బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వర్మని కూల్ చేశారు. కూటమి అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. దాంతో వర్మ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్‌గా నిలబడి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవడం ఎందుకు.. హాయిగా ఎమ్మెల్సీ అయి.. మినిస్టర్ పదవి తీసుకోవచ్చు కదా అని డిసైడ్ అయ్యారు.

చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత వర్మ నేరుగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. పవన్‌ని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత తనదే అని హామీ ఇచ్చాడు వర్మ. పవన్ కూడా పాజిటివ్‌గా స్పందించారు. అంతేకాదు.. పిఠాపురంలో పార్టీ శ్రేణులతో మీటింగ్ పెట్టే బాధ్యత కూడా వర్మకే అప్పజెప్పాడు పవన్. పిఠాపురం వెళ్ళిన వర్మ.. పవన్ తరపున ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా చెలరేగి పోయిన వర్మ ఇంత తొందరగా కూల్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. చంద్రబాబు బాగానే డీల్ చేశారని అంటున్నాయి పార్టీశ్రేణులు.