PM MODI: సికింద్రాబాద్ నుంచి మోడీ.. మెదక్ నుంచి సోనియా.. అగ్రనేతలిద్దరూ తెలంగాణ నుంచే పోటీ?
మోడీని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా సోనియా గాంధీని మెదక్ నుంచి లోక్ సభ ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉంది.
PM MODI: రాబోయే లోక్‌సభ రణరంగానికి తెలంగాణ వేదిక కాబోతుందా. దేశంలో రెండు జాతీయ పార్టీల అధినేతలిద్దరూ ఇక్కడి నుంచి ఎంపీలుగా పోటీ చేయబోతున్నారా..? ప్రధాని నరేంద్ర మోడీని సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తుంది. మోడీని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
PAWAN KALYAN: పవన్ తెలిసి తప్పు చేస్తున్నాడా? లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ వెళ్లడమేంటి..?
కిందటిసారి ఆయన వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. మోడీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించడమే కాక, రాష్ట్రమంతా కూడా ఆయన పోటీ ప్రభావం ఉంటుందని స్థానిక బిజెపి నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. కిందటి సారి మోడీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాల్సింది. కానీ ఉత్తరప్రదేశ్లో పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో భాగంగా ఆయన వారణాసి వెళ్లారు. ఈసారి మాత్రం మోడీని కచ్చితంగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయిస్తే ఆ ప్రభావంతో మరో నాలుగు ఎంపీ సీట్లు తేలిగ్గా గెలవచ్చు అని స్థానిక బిజెపి నేతలు అధిష్టానానికి చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
YS JAGAN: మరో నలుగురు నియోజకవర్గాల ఇంచార్జిల నియామకం.. సిట్టింగ్‌లకు నో ఛాన్స్
బిజెపికి మొదటినుంచి సికింద్రాబాద్ బలమైన నియోజకవర్గం. స్థానిక నేతల విజ్ఞప్తిని మన్నించి మోడీ గనక సికింద్రాబాద్ నుంచి పోటీకి దిగితే దేశం మొత్తం ఇటు వైపే చూస్తుంది. ఇక కాంగ్రెస్ కూడా సోనియా గాంధీని మెదక్ నుంచి లోక్ సభ ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉంది. సోనియా ఇప్పటికే ఆరోగ్య కారణాల రీత్యా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగూ ఇక్కడే ఉంటారు కనుక మెదక్ నుంచి పోటీ చేస్తే అధినేత్రిని కచ్చితంగా గెలిపించుకుంటామని స్థానిక కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సోనియా మొదటి నుంచి చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా అని కాంగ్రెస్ ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూనే ఉంది. అందువలన మెదక్ ఎంపీగా సోనియా దిగితే ఆమెను తేలిగ్గా గెలిపించుకుంటామని, మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
గతంలో ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ సోనియా చేయలేకపోతే ప్రియాంక గాంధీ నైనా మెదక్ నుంచి బరిలోకి దింపాలనేది కాంగ్రెస్ నేతల ప్లాన్. గాంధీ కుటుంబం కేవలం ఉత్తరాదికి మాత్రమే పరిమితం కాదని దక్షిణాదికి కూడా చెందింది అని చెప్పడానికి ఎప్పటినుంచో కసరత్తు జరుగుతోంది. రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలోని వాయినాడుకి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సోనియానుగాని ప్రియాంకను గాని మెదక్ నుంచి పోటీ చేయిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వేవ్‌లో సోనియా గెలుపు తేలికవుతుందని కాంగ్రెస్ నేతల అంచనా. మోడీ సోనియా ఇద్దరూ తెలంగాణ నుంచి బరిలో దిగితే మాత్రం లోక్‌సభ ఎన్నికలు మరింత రంజుగా మారుతాయి.