మొగుడు పెళ్ళాల మధ్య నలిగిపోతున్న మోడీ

ఆయనకు మనందరిలా సంసారం లేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. దేశమే నా కుటుంబం అని చెప్పుకుంటారు. ఆయనే మన ప్రధాని మోడీ. సంసారిక బాధలు లేని ఆయనకు ఇప్పుడు కొత్త సమస్య ఒకటి తలెత్తింది. వేరే వాళ్ళ సంసారిక సమస్య ఆయనకు తలనొప్పిగా మారింది. ఇద్దరు మేధావులైన భార్య భర్త ల

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 03:32 PMLast Updated on: Jan 28, 2025 | 3:32 PM

Pm Modi Suffer With Nirmal Sitaraman Family Issues

ఆయనకు మనందరిలా సంసారం లేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. దేశమే నా కుటుంబం అని చెప్పుకుంటారు. ఆయనే మన ప్రధాని మోడీ. సంసారిక బాధలు లేని ఆయనకు ఇప్పుడు కొత్త సమస్య ఒకటి తలెత్తింది. వేరే వాళ్ళ సంసారిక సమస్య ఆయనకు తలనొప్పిగా మారింది. ఇద్దరు మేధావులైన భార్య భర్త ల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు పీఎంకి తరచు ఇబ్బంది కలిగిస్తుంది. ఇంతకీ ప్రధానికి తమ సిద్ధాంతాలతో ఇబ్బంది పెడుతున్న భార్య భర్తలు ఎవరనేగా మీ ఆలోచన? మరెవరో కాదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆమె భర్త పరకాల ప్రభాకర్.అసలు ఏమిటి వీరిద్దరి విధాన విభేదాలు అవి మోడీ కి ఎలా తలనొప్పిగా మారాయి?

భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురించి కొత్త గా చెప్పడానికి ఏముంటుంది. ? తెలియనిది ఏముంటుంది? స్వతంత్ర భారత దేశంలో రెండవ మహిళా ఆర్థిక మంత్రి నిర్మల. అంతే కాదు దేశం లో అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆమె నే. గతం లో 6 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డ్ ని నిర్మల బ్రేక్ చేశారు. ఇప్పటికి 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు . ఇక నిర్మల భర్త పరకాల ప్రభాకర్. దేశం లో చాలామందికి వీరిద్దరూ భార్య భర్తలని కూడా తెలియదు. సాధారణంగా వీళ్ళిద్దరూ కలసి కనిపించడం అరుదు. నిర్మల బీజేపీ నాయకురాలు. కరుడు కట్టిన హిందుత్వవాది.పరకాల ప్రభాకర్ కుటుంబం తొలినాళ్ళ నుంచి కాంగ్రెస్ వాదులు. ప్రభాకర్ తండ్రి పరకాల శేషావతారం ఉమ్మడి రాష్ట్రం లో 70 లలో మంత్రి గా చేశారు. పరకాల కుటుంబం లో వామపక్ష భావజాలం ఉన్న వాళ్లు ఉన్నారు. ప్రభాకర్ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు కున్నారు. అక్కడే డాక్టరేట్ చేసారు. నిర్మలా కూడా జేఎన్ యూ లోనే చదివారు. కానీ ఇద్దరి అభిప్రాయాలు, సిద్ధాంతాలు వేరు. 1986 లో వీళ్లిద్దరికీ విహాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. ఆమె పేరు వాంగ్మయి . 3 ఏళ్ల క్రితం ఆమె విహాహం జరిగింది.

పరకాల 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం లో చేరారు. ఆ తరవాత చిరు తో విభేదించి, మెగాస్టార్ ని ఆయన పార్టీ ఆఫీస్ లోనే తిట్టిపోసి బయటకు వచ్చారు. ఆ తరవాత 2014 నుంచి 19 వరకు ఏపీ లో టీడీపీ ప్రభుత్వంలో సమాచార సలహాదారు గా పనిచేశారు. పరకాల కోటరీ బాబు చుట్టూ కోట కట్టిందనే విమర్శలు వచ్చాయి. తరవాత చంద్రబాబు కి కూడా దూరమయ్యారు.అప్పటి నుంచి పరకాల మోడీ విధానాలపై పోరాటం చేస్తున్నారు. ఆయన భార్య సాక్షాత్తు దేశ ఆర్ధిక మంత్రి. ప్రధాని మోడీకి రైట్ హ్యాండ్. కానీ ఒకే కుటుంబం లో రెండు విధానాలు. పరకాల నిత్యం బీజేపీ, మోడీ విధానాలను ఉతికి అరేస్తూ ఉంటారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా లో ఆర్టికల్స్ రాస్తూ…. తరచు చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, మతతత్వ ధోరణులుని ఎండగడుతూ ఉంటారు. బీజేపీ ఈవీఎం లను టాంప్టర్ చేస్తోందని, ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందన్నది ప్రభాకర్ ఆరోపణ. దీనిపై ఆయన వన్ మాన్ ఆర్మీ లా పోరాడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ రోజు చివరి గంటలో జరిగిన ఓవర్ ఓటింగ్ పై విరుచుకు పడ్డారు పరకాల. స్పష్టంగా ఓటింగ్ పర్సెంటేజ్ తో సహా అన్ని వివరాలు బయట పెట్టారు. పరకాల వాదన విన్న వాళ్లెవరికైనా బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల అక్రమాలు కు పాల్పడుతుందనే అనుమానం కచ్చితంగా వస్తుంది.

భార్య స్వయంగా మోడీ కాబినెట్ లో 10 ఏళ్లుగా మంత్రి. అందునా ఆర్ధిక మంత్రి. తాను చేసే ప్రతి విమర్శ మోడీ ని, బీజేపీ ని మాత్రమే కాదు దానిలో తన సతీమణి కూడా ఉన్నారని తెలిసినా పరకాల వెనక్కి తగ్గరు. పరకాల ధోరణి ఆర్థికమంత్రి నిర్మల కి అవమానకరంగా, తలనొప్పి గా మారినా ఆమె ఎప్పుడు బయట పడలేదు. అలాగని ఒత్తిడికి గురై తన విధానాలు మార్చుకోలేదు. పార్టీ ని వదిలి పెట్టలేదు. బీజేపీ కూడా ఎప్పుడూ వీరిద్దరి మధ్య విధానపరమైన దూరాన్ని గురించి చర్చించలేదు. కానీ మీడియా లోనూ, రాజకీయపార్టీల్లోను పరకాల, నిర్మల మధ్య జరుగుతున్న సైద్ధాంతిక యుద్ధం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాని మోడీ కి కూడా ఇదంతా తెలుసు. బీజేపీ లో కీలక నాయకురాలు, దేశ ఆర్థిక మంత్రి భర్త ప్రభుత్వ, పార్టీ విధానాలను ఎండగడుతుంటే అది పంటికింద రాయిలా అనిపిస్తుంది. ఆయన విధానం ఆయనది. ఆవిడ విధానం ఆవిడది. దానికి దీనికి ఏమిటి సంబంధం అని సరిపెట్టుకోలేరుగా. అంతర్గతంగా పరకాల వ్యవహారంపై నిర్మల, ప్రధాని మోడీ అసహనంగానే ఉన్నారు.

కానీ పరకాలకు చెప్పి దారిలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదు కనుక వదిలేసారు. కేంద్రం ఆర్ధిక విధానాలపై, బడ్జెట్ పై, ఫైనాన్స్ మినిస్టర్ పై పరకాల ప్రభాకర్ సోషల్ మీడియా లో, మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ఘాటు విమర్శలే చేస్తున్నారు.ఆయన్ను ఎలా కంట్రోల్ చేయాలో ప్రధానికి, బీజేపీ కి అర్థంకావడం లేదు. పోనీ ఏదో ఒక కేసు లో మడత పెట్టేద్దామా అంటే దేశ ఆర్థిక మంత్రి మొగుడాయే. అలా చేయలేరు. పత్రిక, వాక్ స్వతంత్రం ఉన్న దేశం. పోనీ పరకాల ప్రభాకర్ కి పెద్ద ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయా అంటే అవి లేవు. సైద్ధాంతికంగా బీజేపీ కి ప్రభాకర్ వ్యతిరేకం. మొదటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రభాకర్, సీతారామన్ ఇద్దరు ఇప్పుడు విడి విడిగా ఉంటున్నారు.కూతురు పెళ్లి తరవాత కలవలేదు. సీతారామన్ హైదరాబాద్ లో పరకాల, ఢిల్లీ లో సీతారామన్ ఎవరి దారిన వాళ్లు ఉంటున్నారు. పరకాల మాత్రం ఎక్కడ రాజీపడటం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, బీజేపీ ఈకలు పీకేస్తున్నాడు. ఏం చేయాలో అర్థంకాక ప్రధాని మోడీ అసహనంతో దిక్కులు చూస్తున్నారు.