PM Modi: మోదీకి ఘనస్వాగతం పలికిన శ్వేతసౌధం.. ఆత్మీయంగా ఆహ్వానించిన బైడెన్ దంపతులు
న్యూయార్క్ నుంచి వాష్టింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు, భారత రాయబారులు ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. మోదీ అమెరికా చేరుకునే సరికి వర్షం పడుతున్నప్పటికీ ఆయన కోసం అభిమానులు, చిన్నారులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
PM Modi: అమెరికా పర్యటనలో ఉన్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. న్యూయార్క్ నుంచి వాష్టింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు, భారత రాయబారులు ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. మోదీ అమెరికా చేరుకునే సరికి వర్షం పడుతున్నప్పటికీ ఆయన కోసం అభిమానులు, చిన్నారులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
వారిని పలకరించిన మోదీ అక్కడి నుంచి వైట్ హౌజ్‌కు చేరుకున్నారు. శ్వేతసౌధంలో మోదీకి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి, దేశ ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆత్మీయ స్వాగతం పలికారు. శ్వేతసౌధం బయటకు వచ్చి మోదీని ఆహ్వానించారు. వైట్ హౌజ్‌లో మోదీకి కనీవినీ ఎరుగని ఆతిథ్యం లభించింది. వైట్ హౌజ‌్‌లో బైడెన్ దంపతులతోపాటు, వారి కుటుంబ సభ్యులతోనూ మోదీ సరదాగా గడిపారు. బైడెన్, జిల్ బైడెన్, మోదీ కలిసి ఫొటోలు తీయించుకున్నారు. మోదీకి అక్కడ అధికారిక డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ సమయంలో భారతీయ సంగీతాన్ని మ్యూజిషియన్స్ ప్లే చేస్తారు. అక్కడి ఫేమస్ ధూమ్ బృందం ఈ సంగీత, నృత్య ప్రదర్శన నిర్వహించనుంది. ఈ డిన్నర్‌లో చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను కూడా వడ్డించబోతున్నారు.
చిరుధాన్యాల గురించి మోదీ పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మారినేటెడ్ మిల్లెట్స్‌తోపాటు గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, అవకాడో సాస్, వాటర్ మెలన్, స్టఫ్డ్ పోర్టబెల్లో మష్రూమ్స్, క్రిస్ప్‌డ్ మిల్లెట్ కేక్స్, లెమన్ దిల్ యోగర్ట్, శాఫ్రాన్ రిసోటో వంటివి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విందు అనంతరం మోదీ, బైడెన్ బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మోదీకి బైడెన్ 20వ శతాబ్దానికి చెందిన చేతితో తయారు చేసిన అమెరిన్ బుక్ గ్యాలరీని, వింటేజ్ అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇస్తారు. అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీకి సంబంధించిన హార్డ్ కవర్ పుస్తకం, రాబర్ట్ ఫ్రాస్ట్ మొదటి కవితా సంపుటి పుస్తకాన్ని కూడా అందించనున్నారు.