PM Modi: తెలంగాణపై బీజేపీ ఫోకస్.. మరోసారి రాష్ట్రానికి మోదీ.. హైదరాబాద్‌లో రోడ్ షో..!

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా దక్షిణాదిపై బీజేపీ ఆశలు వదులుకోలేదు. ప్రధానంగా తెలంగాణపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు రాష్ట్రంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2023 | 05:32 PMLast Updated on: Jun 06, 2023 | 5:32 PM

Pm Modis Telangana Tour Confirmed In June He Will Conduct A Road Show

PM Modi: బీజేపీ అధిష్టానం ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడ కష్టపడితే తొలిసారి అధికారంలోకి రావొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే తెలంగాణపై మరింత ఫోకస్ చేస్తోంది. త్వరలోనే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో రోడ్ షో కూడా నిర్వహించే అవకాశం ఉంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా దక్షిణాదిపై బీజేపీ ఆశలు వదులుకోలేదు. ప్రధానంగా తెలంగాణపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు రాష్ట్రంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతుంది. ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆలోపు వీలైనన్ని కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. అలాగే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నద్దాసహా కీలక నేతలంతా వరుసగా తెలంగాణలో పర్యటించబోతున్నారు. గతంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లాడు. ఇప్పుడు మహా జన్ సంపర్క్ అభియాన్ పేరుతో మరో కార్యక్రమానికి బీజేపీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.

గతంలోనే అమిత్ షా, జేపీ నద్దా పర్యటనలు ఖరారు కాగా.. ఇప్పుడు మోదీ యాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. అలాగే సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇక్కడ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో మోదీ భారీ రోడ్ షో చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా ఇలాంటి రోడ్ షోలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెలలో మల్కాజిగిరి రోడ్ షో ప్లాన్ చేశారు. ఈ అంశంపై పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మోదీ పర్యటనకు సంబంధించిన వివరాల్ని ఖరారు చేస్తారు. ఆ తర్వాత మోదీ పాల్గొనే తేదీ, సభా స్థలం, రోడ్ షో వివరాలు వెల్లడవుతాయి. అయితే, ఈ కార్యక్రమాలన్నింటినీ భారీ ఎత్తున చేపట్టి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఊపునిచ్చేనా?
కర్ణాటక ఎన్నికల్లో ఫలితం తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి మారిపోయింది. గతంలో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. మరోవైపు కాంగ్రెస్ బలపడుతోంది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఒక దశలో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుంది అనిపించింది. కానీ, ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ కనిపిస్తోంది. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుంది అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీసహా నేతల పర్యటన బీజేపీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.