లేడీ సింగం కాదు…. పోలీస్ హైనా రేపో మాపో అంజు యాదవ్ అరెస్ట్.
నాకు ఎవడైనా అడ్డొస్తే వేసేస్తా. నా మాటకు ఎదురొస్తే కుమ్మిపడేస్తా.నీ బాబుతో చెప్పుకో. సీఎం ఆఫీస్ నా కంట్రోల్ లో ఉంటది. నువ్వు ఎంతరా? నలిపి పడేస్తా నా కొడకా... ఇలాంటి మాటలు వినగానే వాడెవడో రౌడీషీటర్ అనుఉంటారు మీరు.

నాకు ఎవడైనా అడ్డొస్తే వేసేస్తా. నా మాటకు ఎదురొస్తే కుమ్మిపడేస్తా.నీ బాబుతో చెప్పుకో. సీఎం ఆఫీస్ నా కంట్రోల్ లో ఉంటది. నువ్వు ఎంతరా? నలిపి పడేస్తా నా కొడకా… ఇలాంటి మాటలు వినగానే వాడెవడో రౌడీషీటర్ అను ఉంటారు మీరు. కానీ ఈ మాటలు ఒక మహిళా సిఐ అంజు యాదవ్ వి. వైసిపి హయాంలో చెలరేగిపోయి అవినీతి అరాచకాలకు పాల్పడిన సీఐ అంజూయాదవ్ త్వరలో కటకటాలు లెక్కపెట్టక తప్ప దా? వైసిపి హయాంలో రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పద, అవినీతిమయమైన మహిళా పోలీస్ అధికారిగా రికార్డుల కు, ఎక్కిన అంజు యాదవ్ అరాచక చిట్టా మొత్తం బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం లూప్ లైన్ లో ఉన్న ఈ అరాచక శక్తి త్వరలోనే లోపలికి వెళ్లడం ఖాయం . అంజు యాదవ్ గురించి డిపార్ట్మెంట్ లోనే కాదు రాష్ట్రం మొత్తం పరిచయమే. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత వివాదాస్పద మహిళా సర్కిల్ ఇన్స్‌పెక్టర్.. ఏ స్టేషన్లో పనిచేసినా అక్కడ వివాదాలే. సత్యవేడులో అంజు యాదవ్ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ ఆర్ఎంపీపై చేయి చేసుకోగా.. ఆయన ప్రైవేట్ కేసు పెట్టారు.
కింది కోర్టులో మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కొన్న అంజూయాదవ్.. హైకోర్టును ఆశ్రయించి, ఆ తర్వాత బాధితుడితో రాజీ కుదుర్చుకుంది. 2009 ….11 మధ్యకాలంలో తిరుపతి వెస్ట్ సీఐ గా పనిచేస్తున్నప్పుడు పోలీసు సిబ్బందినే ఇబ్బంది పెట్టి డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ ఎదుర్కొంది. ఇక రేణిగుంట అర్బన్ సీఐ గా కూడా అదే ఓవరాక్షన్ ప్రదర్శించి వార్తల్లో నిలిచింది. నాలుగేళ్ళు క్రితం రేణిగుంట వైసీపీ ఎంపీపీ పట్ల దురుసుగా ప్రవర్తించడం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పవిత్రతో వాగ్వాదానికి దిగడం ఇలా ఒకటి కాదు అంజు అరాచకాలు. రాజకీయ పలుకుబడి, ఆపై సీఎం ఆఫీస్ లో పట్టుతో అంజు యాదవ్ శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గానే బదిలీ చేసుకుని తన పంతం నెగ్గించుకుంది.ఇక శ్రీకాళహస్తి కి వెళ్ళాక కూడా అంజూ యాదవ్ తీరు మారలేదు…. పైగా మరింత రెచ్చిపోయింది.
2022 అక్టోబర్‌లో కాళహస్తీలో రోడ్డు సైడ్ హోటల్ నడుపు కునే ధనలక్ష్మి అనే మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి, చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా ఆమెను జీప్ ఎక్కించింది సీఐ అంజూ . రాత్రివేళ హోటల్ నిర్వహిస్తున్న ఆ మహిళను బూతులు తిడుతూ, చీర ఊడేలా కొడుతూ అంజు ప్రవర్తించిన తీరు అప్పట్లో రాష్ట్రంలోనే సంచలమైంది. రోడ్డుపక్క హోటల్ నిర్వహిస్తున్నందుకు అంజు లంచం అడిగిందని ,ఇవ్వకపోవడంతో తమపై కక్షగట్టిందని బాధితురాలి భర్త హరినాయుడు అప్పట్లో ఆరోపించారు. సిఐ కొట్టడంతో ధనలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది, తన తల్లిని కొట్టొదని కొడుకు ప్రాధేయపడ్డితే అతని షర్ట్ చింపి, అడ్డొస్తే గంజాయి కేసు పెట్టి లోపల వేస్తానని బెదిరించిందట అంజు. అంతేకాదు అంజు కి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగిన టిడిపి, జనసేన నేతల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాక ఇద్దరు కార్యకర్తల చెంప పగల కొట్టింది ఈ టెర్రర్ అంజు.
ధనలక్ష్మి అని మహిళపై దాడి ఘటనపై అప్పటి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. అంజు యాదవ్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ కమిషన్ స్పందించి సీఐపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశించింది. అలాగే ఘటనపై కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేయాలని.. బాధిత మహిళకు వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించింది. ఈ ఘటనపై కమిటీ ..సిఐ అంజుయాదవ్ తో పాటు బాధితురాలు ధనలక్ష్మీ సహా మరో 15 మంది సాక్షులను ప్రశ్నించింది. కానీ ఆ తర్వాత అ కేసు ఏమైందో ఎవరికి తెలియలేదు. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడితో అధికారులు అంజూ యాదవ్ కు అనుకూలంగా జాతీయ మహిళా కమిషన్కు నివేదిక ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. 2023 జూలైలో సీఐ అంజు యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. ఆందోళన చేస్తున్న జనసేన నేతలపై చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళు పై అప్పటి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టారు. అ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాళహస్తి లోని పెళ్లిమండం దగ్గర సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన నేతలు ప్రయత్నించడంతో పలువురిని శ్రీకాళహస్తి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది జనసేన నేతలు పోలీసుల కళ్లుగప్పి పెళ్లిమండపం దగ్గరకు చేరుకున్నారు. అది చూసి జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ విరుచుపడ్డారు. కాళహస్తీ జనసేన కార్యకర్తపై అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. అతని రెండు చెంపలపైనా పలుమార్లు కొట్టారు. దీనిపై జనసైనికులు భగ్గుమన్నారు. వీడియో తీస్తున్న వ్యక్తిపైనా ఆమె దాడికి పాల్పడింది. ఈ ఘటనపై అంజు యాదవ్‌కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు అప్పటి తిరుపతి ఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. అయితే అప్పటి అధికారులు దర్యాప్తు చేసి కేవలం ఛార్జ్‌మెమోతో సరిపెట్టేశారు.
ఆనాడు ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతికి వచ్చి అప్పటి ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు… అయినప్పటికీ అంజు యాదవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్నతాధికారులు ఆమెను మొదట విఆర్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత లూప్ లైన్ లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పొలిటికల్ గా అంజు యాదవ్ కున్న బలం ఆమెను రక్షిస్తుంది. దీంతో టిడిపి జనసేన కార్యకర్తలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఒకప్పుడు ఇదే అంజు యాదవ్ పై ఫిర్యాదు చేసిన అనిత ఇప్పుడు హోం మంత్రిగా ఉండి కూడా ఎందుకు ఈ ఆరాచక సీఐపై యాక్షన్ తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో కాళహస్తి కేంద్రంగానే అంజు యాదవ్ కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని సెటిల్మెంట్ల ద్వారా కోట్ల రూపాయలుసంపాదించారని ఆరోపిస్తున్నారు.
అంజు యాదవ్ ఏర్పేడు,ఎయిర్ పోర్టు సమీపంలోనూ కోట్లు విలువచేసే భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తున్నారు కూటమినేతలు.గతంలో సీఐ గా అంజు యాదవ్ పనిచేస్తున్న సమయంలో ఆమె భర్త వైసీపీ పెద్దలకు దగ్గరగా ఉన్నారని, అతను సీఎంఓ లో కీలక వ్యక్తిగా మొత్తం వ్యవహారాలన్నీ నడిపించారని, ఇప్పుడు కూడా మరోసారి ఆమెకు పోస్టింగ్ ఇప్పించడానికి కూటమి ప్రభుత్వంలో కూడా కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఆరోపిస్తున్నారు కూటమీ నేతలు.మొత్తానికి ఈ ఒత్తిడితో ఐదేళ్ల కాలంలో అరాచకంగా వ్యవహరించిన అంజు యాదవ్ పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే అంజయాదవ్ వ్యవహారాలపై ఫైల్ సిద్ధమైంది. ఇక రేపో మాపో అంజు ఊచలు లెక్కపెట్టక తప్పదు.