నందిగం సురేష్ కు బెయిల్ కష్టమే…?
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ కు ఇప్పటికే రిమాండ్ ను కోర్ట్ పొడిగించింది. బెయిల్ పిటీషన్ ను కోర్ట్ కొట్టేసింది
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ కు ఇప్పటికే రిమాండ్ ను కోర్ట్ పొడిగించింది. బెయిల్ పిటీషన్ ను కోర్ట్ కొట్టేసింది. ఈ నెల 17 వరకు ఆయనకు రిమాండ్ విధించారు. ఇక తాజాగా ఆయనపై మరో మర్డర్ కేసు నమోదు అయింది. 2020 నాటి మర్డర్ కేసులో నందిగాం సురేష్ పై మంగళగిరి కోర్టులో పిటి వారెంట్ జారీ చేసారు.
పిటి వారెంట్ ను అనుమతించిన మంగళగిరి కోర్టు…. ఈ నెల ఏడో తేదిన 2020నాటి మర్డర్ కేసులో కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చింది. వెలగపూడిలో రెండు వర్గాల మధ్య 2020లో ఘర్షణ జరగగా ఘర్షణల్లో మహిళ మృతి చెందింది. మర్డర్ కేసులో నిందితుడిగా నందిగాం సురేష్ ను చేర్చారు పోలీసులు. దీనితో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనపడటం లేదు.