వర్మకు పోలీసులు చుక్కలు.. నిజం ఒప్పెసుకున్నాడా…?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వాళ్ళలో.. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2025 | 03:33 PMLast Updated on: Feb 08, 2025 | 3:33 PM

Police Give Varma Points Did He Admit The Truth

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వాళ్ళలో.. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. వైసీపీకి సపోర్ట్ చేస్తూ టిడిపిని అలాగే జనసేన పార్టీని కించపరుస్తూ సోషల్ మీడియాలో వర్మ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలు ఎక్కువగా ఉండటం పట్ల అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఒక సినిమా దర్శకుడు ఒక రాజకీయ పార్టీ అధినేతను, మాజీ ముఖ్యమంత్రిని ఏ విధంగా అవమానిస్తాడు అని చాలామంది అప్పట్లో ఫైర్ అయ్యారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మకు చుక్కలు చూపించడం ఖాయమని చాలామంది ఎదురు చూశారు. అయితే అనూహ్యంగా రాంగోపాల్ వర్మ అరెస్టు నుంచి తప్పుకున్నారు. ఇక ఇటీవల ఆయన విచారణకు హాజరు కావాలని పోలీసులు వాట్సాప్ లో నోటీసులు పంపించగా.. వర్మ ఒంగోలులో విచారణకు హాజరయ్యారు. హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలు వెళ్లిన వర్మ.. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ బాబు వర్మను పలు కీలక ప్రశ్నలు అడిగారు. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు మీకు వైసీపీ ఆఫీసు నుంచి వచ్చాయా.. లేదంటే మీరే స్వయంగా ఆ పోస్టులను తయారు చేశారా.. అనే ప్రశ్నలతో పాటుగా అందుకోసం మీకేమైనా డబ్బులు చెల్లించారా అనే ప్రశ్నలు కూడా వేసినట్టు తెలుస్తోంది. అయితే వర్మ మాత్రం ఎవరి తప్పు లేదని.. తానే ఆ ఫోటోలను పోస్ట్ చేశానని, వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు వర్మ పేర్కొన్నారు.

ఇక వైసీపీ నేతలు ఎవరూ తనను ఫోటోలు పెట్టమని పోస్ట్ లు పెట్టమని.. ఎప్పుడు అడగలేదని వాళ్ళతో తనకు స్నేహం మాత్రమే ఉందని.. తాను ఎప్పుడూ డబ్బులు కోసం అలాంటివి చేయలేదని వర్మ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక పోలీస్ విచారణకు ముందు.. ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్నకు వర్మ ఆరోగ్యం సహకరించలేదని, తన వ్యక్తిగత పనుల కారణంగా బిజీగా ఉండడం వల్లనే విచారణకు హాజరు కాలేకపోయానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వైసిపి నేతలు ఎవరైనా మిమ్మల్ని వ్యూహం సినిమా సమయంలో కలిశారా అనే ప్రశ్నలకు వర్మ సమాధానం దాటవేసినట్లు సమాచారం.

దాదాపు 40 ప్రశ్నలను శ్రీకాంత్ బాబు అడిగినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా తాను హాజరవుతానని.. వ్యక్తిగత పనులు ఉంటే ముందే తెలియజేస్తానని వర్మ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అరెస్టు సంగతి పక్కన పెట్టి విచారణకు.. ముందు వర్మ హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనితో రాంగోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. ఇక విచారణకు వచ్చే ముందు వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తో వర్మ మాట్లాడారు. హైదరాబాదు నుంచి వస్తున్న వర్మను వాళ్ళిద్దరే రిసీవ్ చేసుకుని విచారణకు పంపించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.