నందిగం సురేష్ ను వదలని పోలీసులు
గుంటూరు జిల్లా జైలు నుండి పిటి వారెంట్ పై నందిగాం సురేష్ ను మంగళగిరి కోర్టుకు పోలీసులు తరలించారు. 2020లో జరిగిన మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు.

గుంటూరు జిల్లా జైలు నుండి పిటి వారెంట్ పై నందిగాం సురేష్ ను మంగళగిరి కోర్టుకు పోలీసులు తరలించారు. 2020లో జరిగిన మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. గురవారమే పిటి వారెంట్ ను మంగళగిరి కోర్టు అనుమతించింది. ఈ రోజు జడ్జి ముందు నందిగాం సురేష్ ను ప్రవేశ పెడతారు. ఇప్పటికే టిడిపి కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
2020 నాటి హత్య కేసులో పిటి వారెంట్ అనుమతించడంతో ఇంకా జిల్లా జైల్లోనే నందిగం సురేష్ ఉన్నాడు. హత్య కేసులో మంగళగిరి కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.