ఎయిర్పోర్ట్ లో జగన్ కోసం పోలీసుల వెయిటింగ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన విషయంలో సందిగ్దత నెలకొంది. అసలు జగన్ తిరుమల వెళ్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు పోలీసు వర్గాలకు.

Guntur: YSR Congress chief YS Jaganmohan Reddy addresses during a party programme in Guntur of Andhra Pradesh on July 9, 2017. (Photo: IANS)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన విషయంలో సందిగ్దత నెలకొంది. అసలు జగన్ తిరుమల వెళ్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు పోలీసు వర్గాలకు. రేణిగుంట విమాశ్రయంలో వైయస్ జగన్ కు కాన్వాయ్ సిద్ధం చేసిన పోలీసులు… జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే వైయస్ జగన్ తిరుమల పర్యటన రద్దయిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అధికారికంగా వైఎస్ జగన్ పర్యటన రద్దు అయిన విషయం తమకు తెలియదు అంటున్న తిరుపతి పోలీసులు… ప్రోటోకాల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కి ఇచ్చే భద్రత… వాహన శ్రేణిని సమకూర్చామని చెప్తున్నారు. మరో వైపు జగన్ తిరుమల వెళ్తే కచ్చితంగా సంతకం చేయాల్సిందే అనే డిమాండ్ లు వినపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసారు హిందు సంఘాలు.