ASSEMBLY ELECTIONS: రెండు సీట్లలో నేతల పోటీ ఎందుకు..? ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ దాకా..!
గతంలో కూడా ఇలాగే రెండు స్థానాల్లో చాలా మంది ప్రముఖులు పోటీ చేశారు. BRS అధ్యక్షుడు, CM కేసీఆర్ సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ ఈసారి పోటీ చేస్తున్నారు. అలాగే PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో KCRపై పోటీకి దిగారు.
ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న ముగ్గురు నాయకులను చూస్తున్నాం. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలు రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్నారు. ఒకరు BRS చీఫ్ KCR, ఇంకొకరు PCC చీఫ్ రేవంత్ రెడ్డి, మూడో వ్యక్తి బీజేపీ నేత ఈటల రాజేందర్. CM కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా.. రేవంత్, ఈటల పోటీ పడుతున్నారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది డిసెంబర్ 3న తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇలాగే రెండు స్థానాల్లో చాలా మంది ప్రముఖులు పోటీ చేశారు. BRS అధ్యక్షుడు, CM కేసీఆర్ సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ ఈసారి పోటీ చేస్తున్నారు.
TELANGANA CONGRESS: కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ నమ్మొచ్చా.. కాంగ్రెస్‌లో బీసీ అభ్యర్థులు ఎంతమంది..?
అలాగే PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో KCRపై పోటీకి దిగారు. BJP నేత ఈటల రాజేందర్ కూడా సిట్టింగ్ స్థానం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కేసీఆర్‌పై సై అంటున్నారు. అయితే ఈ ముగ్గురు లీడర్లు కూడా ఫస్ట్ టైమ్ ఇలా.. రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒకేసారి పోటీకి దిగారు. KCR 2014లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కానీ అందులో ఒకటి గజ్వేల్ అసెంబ్లీ సీటు, రెండోది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం.రెండు చోట్లా గెలిచారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో చూస్తే.. పవన్ కల్యాణ్, చిరంజీవి, NTR, పీవీ నరసింహారావు కూడా రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి బరిలోకి దిగాడు. రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా.. పాలకొల్లు, తిరుపతి నియోజకవర్గాల్లో నిలబడ్డారు. తిరుపతిలో గెలవగా.. పాలకొల్లులో ఓడిపోయారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ 1985లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను కవర్ చేయాలనుకున్నారు.
కోస్తాలోని గుడివాడ, రాయలసీమలో హిందూపురం, తెలంగాణలో నల్లగొండ అసెంబ్లీ స్థానాల్లో NTR నిలబడ్డారు. మూడు చోట్లా గెలిచినా నల్లగొండ, గుడివాడ స్థానాలకు రిజైన్ చేసి హిందూపురంలో కంటిన్యూ అయ్యారు. 1989 ఎన్నికల్లోనూ NTR రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో నిలబడ్డారు. కానీ.. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ లీడర్ చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయారు. అంతకుముదు రావి నారాయణ రెడ్డి, పెండ్యాల రాఘవరావు కూడా ఇలాడే రెండు, మూడు స్థానాల్లో నిలబడ్డారు. సీఎంలు రెండేసి చోట్ల పోటీ చేయడం అనేది దేశంలో చాలా చోట్ల జరిగింది. కేసీఆరే కాదు.. వేరే రాష్ట్రాల సీఎంలు ఇలా రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు కూడా. కర్ణాటక ప్రస్తుత CM సిద్ధ రామయ్య, మాజీ సీఎం కుమార స్వామి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఇక పీవీ నరసింహారావు అయితే రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి పోటీ చేశారు.
Etela Rajender: ఈటెలకు షాకిచ్చిన బీజేపీ.. వేములవాడ అభ్యర్థి మార్పు..
1991లో ఆయన PM అయ్యే నాటికి పార్లమెంటు సభ్యుడు కూడా కాదు. దాంతో నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి.. ఉపఎన్నికల్లో అక్కడ పీవీని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ తరువాత 1996 ఎన్నికల్లో నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపురం లోక్‌సభ సీటు నుంచి కూడా PV పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు. నంద్యాలకి రిజైన్ చేసి.. బరంపురానికి ప్రాతినిధ్యం వహించారు. ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అటల్ బిహారీ వాజపేయీ, ఎల్‌కే అద్వానీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా చాలామంది సీనియర్ పొలిటికల్ లీడర్స్.. ఒకే ఎన్నికల్లో రెండేసి స్థానాల నుంచి బరిలోకి దిగారు.